మాజీ మంత్రి కేటీఆర్ పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు వేసారు. కేటీఆర్ రాజకీయాలు బంద్ చెయ్యాలని ఉంది అన్నాడు… బంద్ చెయ్యి ఎవరు వద్దు అనలేదు…అమెరికా వెళ్లి బాత్ రూంలు కడుక్కో అంటూ తన మార్క్ కామెంట్స్ చేసారు. అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్ ప్రజలను కలిసే సమయం దొరకలేదన్నారు. మీ నాన్న 10 నెలలుగా ఫామ్ హౌస్ లో ఉన్నారు..ఏమైనా నష్టం జరిగిందా అని నిలదీశారు.
కేటీఆర్ వచ్చింది ప్రజల కోసం కాదు ఆయన వచ్చింది డబ్బుల కోసం, అధికారం కోసం, ఫామ్ హౌస్ కోసమన్నారు. మీకు పది నెలల పాలనే విసుగొస్తే పదేళ్లు మిమ్మల్ని ఎలా భరించారని నిలదీశారు. కేటీఆర్ మోకాళ్ళ యాత్ర చేసిన ప్రజలు విశ్వసించరన్నారు. కేటీఆర్ కు తన నాన్న, చెల్లె, బావతో పాటు ఎవరిపై నమ్మకం లేదన్నారు ఎంపీ. ఫామ్ హౌస్ కేసులో పాలేవో.. నీళ్ళేవో తెలాలంటే సీసీ ఫుటేజ్ బయట పెట్టాల్సిందేనని డిమాండ్ చేసారు. తెలంగాణలో ఆడవాళ్లు తాగుతారని కోరుట్ల ఎమ్మెల్యే అంటున్నారు… తెలంగాణలో ఎక్కడైనా ఆడవాళ్లు తాగుతారా అని ప్రశ్నించారు. దీపావళికి బజార్లలో బాంబులు పేలాయి కానీ పొంగులేటి చెప్పిన కుక్క తోక పటాకులు కూడా పేలలేదని ఎద్దేవా చేసారు.