TELANGANA CONGRESS: తెలంగాణ కాంగ్రెస్‌కు మరింత జోష్ తెచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు. వరుస పర్యటనల ద్వారా శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (MALLIKARJUN KHARGE), అగ్రనేత రాహుల్ గాంధీ (RAHUL GANDHI) శుక్రవారం తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఇద్దరూ వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మల్లికార్జున ఖర్గే శుక్రవారం ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
P Chidambaram: కేసీఆర్ సర్కారు అన్ని రంగాల్లో విఫలమైంది: కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం
అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు గాంధీభవన్ వెళ్తారు. అనంతరం అక్కడ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత సాయంత్రం 4 గంటలకు కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ బహిరంగలో పాల్గొంటారు. సమావేశం అనంతరం ఖర్గే హైదరాబాద్ తిరిగి వెళ్తారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోనే బస చేస్తారు. శనివారం ఉదయం 10:30 గంటలకు తిరిగి బెంగుళూరు వెళ్తారు. మరో అగ్రనేత రాహుల్ గాంధీ కూడా శుక్రవారమే తెలంగాణకు రానున్నారు. ఒకే రోజు 5 నియోజకవర్గాల్లొ సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. శంషాబాద్ నుంచి హెలికాప్టర్లో ఉదయం 11 గంటలకు పినపాకకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటల వరకు రోడ్ షో కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు.
తర్వాత పినపాక నుంచి హెలికాప్టర్లో నర్సంపేటకు చేరుకుని అక్కడ మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు పర్యటిస్తారు. నర్సంపేట నుంచి రోడ్డు మార్గం ద్వారా వరంగల్ ఈస్ట్ చేరుకుంటారు. అనంతరం వరంగల్ ఈస్ట్‌లో సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్ర చేస్తారు. తర్వాత వరంగల్ ఈస్ట్ నుంచి వెస్ట్‌కు వెళ్తారు. సాయంత్రం 6:30 గంటలకు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ రాజేంద్రనగర్ చేరుకుంటారు రాహుల్ గాంధీ. రాజేంద్రనగర్ సమావేశం అనంతరం ఢిల్లీ బయల్దేరి వెళ్తారు.