RAHUL GANDHI: అవకాశం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు, లీడర్లు.. మా రాహుల్ గాంధీయే ప్రధాని కావాలి.. ఈసారి రాహుల్‌ని ప్రధానిని చేద్దాం అంటూ స్లోగన్స్ ఇస్తుంటారు. కానీ, పాపం.. రాహుల్‌కి ఆ యోగం లేనట్టుంది. బీజేపీ దూకుడు, ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ కారణంగా కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఇప్పట్లో లేదు. దాంతో బీజేపీయేతర ప్రతిపక్షాలతో కలసి ఏర్పడిన ఇండియా కూటమిని నమ్ముకుంది హస్తం పార్టీ. ఆ కూటమిలోని నేతలు ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ పనికిరాడని తేల్చేశారు. ఆయన స్థానంలో మరో వ్యక్తి పేరును ప్రతిపాదిస్తున్నారు.
TDP, Janasena : టీడీపీ, జనసేనలో కొత్త గొడవ ! అదేంటి ! లోకేష్ అలా మాట్లాడాడు..?
రాహుల్ గాంధీని భావి భారత ప్రధానిగా ఊహించుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులకు ఇండియా కూటమి గట్టి షాక్ ఇచ్చింది. తమ ప్రధాని అభ్యర్థి రాహుల్ కాదు.. ఆయన్ని ఒప్పుకోవడం లేదని తేల్చేసింది. రాహుల్ స్థానంలో AICC అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే పేరును ప్రతిపాదించింది. ఈసారి దళిత ప్రధాని ఉండాలని ప్రతిపాదించడం ద్వారా రాహుల్‌ను పక్కకు నెట్టేసింది. ఈ నిర్ణయం గాంధీ కుటుంబానికే కాదు.. కాంగ్రెస్ శ్రేణులకు కూడా నచ్చడం లేదు. ప్రధాని నరేంద్రమోడీ తరుచుగా కాంగ్రెస్ వారసత్వ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. ఆ విమర్శల నుంచి తప్పించుకోడానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టలేదు. తాము చెబితే వినే మనిషి అయిన మల్లిఖార్జున్ ఖర్గేని తెచ్చిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడు రాహుల్ ప్రధాని పదవికి ఖర్గేనే ప్రధాన అడ్డంకిగా మారారు. నెహ్రూ, ఇందిరా దగ్గర నుంచి రాజీవ్ గాంధీ దాకా.. గాంధీ-నెహ్రూ ఫ్యామిలీ వారసత్వ రాజకీయాలు కొనసాగాయి. కానీ విదేశీ మహిళ అన్న కారణంగా సోనియా గాంధీ ప్రధాని పదవిని వదులుకోవాల్సి వచ్చింది.
Parliament Elections : ఆ రెండు ఎంపీ సీట్లకు తీవ్ర పోటీ..!
ఆమె తర్వాత కనీసం రాహుల్ అయినా పీఎం పోస్టులో కూర్చోవాలని కాంగ్రెస్ శ్రేణులు ఆశలు పెట్టుకున్నాయి. కానీ ఇండియా కూటమి.. రాహుల్‌ని రిజెక్ట్ చేయడంతో హస్తం నేతలకు నిరాశే మిగిలింది. ఇండియా కూటమి ఏర్పాటు కాకముందు నుంచే కాంగ్రేసేతర పార్టీల్లో రాహుల్ గాంధీ మీద సదభిప్రాయం లేదు. ఆయన ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయిన నేతలు కూడా రాహుల్ సీరియస్ పొలిటీషియన్ కాదని ముద్రవేసి వెళ్ళిపోయారు. ఇండియా కూటమిలో ఉన్న శరద్ పవార్, నితీష్ కుమార్, కేజ్రీవాల్ లాంటి నేతలు తాము పీఎం రేసులో ఉన్నామని చెప్పుకున్నా.. వాళ్ళని మిగతా పార్టీల నేతలు అంగీకరించలేదు. ఈ మధ్య జరిగిన ఇండియా కూటమి సమావేశంలోనే పీఎం రేసుపై చర్చ జరిగింది. దళిత ప్రధాని అనే అంశాన్ని మమతా బెనర్జీతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ మీటింగ్‌లో ప్రతిపాదించారు. దీనిపై మిగతా పార్టీలేవీ వ్యతిరేకించలేదు. అంటే అప్పుడు రాహుల్ అభ్యర్థిత్వాన్ని ఇండియా కూటమిలో ఏ పార్టీ కూడా ఒప్పుకున్నట్టు కనిపించలేదు. పైగా ఉన్న దళిత నేతల్లో ఖర్గేనే ఫేమస్ కాబట్టి.. ఆయన్నే ప్రధాని చేయాలని అందరూ పరోక్షంగా నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
అసలు ఖర్గేయే తెరవెనుక ఈ కథని నడిపినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉంటూనే.. కాంగ్రెస్ పార్టీలో సొంత కోటరీని ఏర్పాటు చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఇండియా కూటమి దళిత కార్డు ఉపయోగించడంతో.. గాంధీ కుటుంబం పరిస్థితి మింగలేక.. కక్కలేక అన్నట్టుగా ఉంది. ఖర్గేను వద్దని చెబితే.. కాంగ్రెస్ దళితుడిని వ్యతిరేకించిందన్న అపవాదు వస్తుంది. అందుకే రాహుల్ గాంధీ కూడా ఖర్గే అభ్యర్థిత్వాన్ని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. తాను నితీష్ కుమార్‌తో కూడా మాట్లాడాననీ.. ఆయన కూడా ఒప్పుకున్నారని చెప్పారు. మొత్తానికి రాహుల్ గాంధీ ప్రధాని అవుతారన్న కాంగ్రెస్ శ్రేణుల ఆశలపై ఇండియా కూటమి నీళ్ళు చల్లినట్టయింది.