ASSEMBLY ELECTIONS: నేతల టూర్లకు తుఫాన్ టెన్షన్.. తడుస్తూ, వణుకుతూనే ప్రచారం.. సభలు క్యాన్సిల్

రాష్ట్రంలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అసలే చలికాలం.. పైగా వర్షాలు.. చల్లటిగాలులు కూడా వీస్తున్నాయి. గురువారం నాడు కేటీఆర్, రేవంత్ రెడ్డి వర్షంలో తడుస్తూనే ప్రచారం చేశారు. శుక్రవారం నాడైతే చాలా చోట్ల భారీ వర్షం కురిసింది. దాంతో లీడర్ల సభలకు ఆటంకం కలిగింది.

  • Written By:
  • Publish Date - November 24, 2023 / 06:16 PM IST

ASSEMBLY ELECTIONS: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హీటెక్కినా.. తుఫాన్ ఎఫెక్ట్‌తో వాతావరణం చల్లబడింది. మరో నాలుగు రోజుల్లో ప్రచారం గడువు ముగుస్తోంది. దాంతో అన్ని పార్టీల నేతలు నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన లీడర్లే కాకుండా.. కర్ణాటక, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, అసోం.. ఇలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వివిధ పార్టీల అగ్రనేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. అయితే గత రెండు రోజులుగా రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. దాంతో హెలికాప్టర్లు మొరాయిస్తున్నాయి. నేతల రోడ్డు ప్రయాణాలకు కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. మిగిలిన ఈ నాలుగు రోజుల్లో వర్షాలు పడితే.. క్యాంపెయిన్ ఆగిపోతుందని పొలిటికల్ లీడర్లు టెన్షన్ పడుతున్నారు.

PAWAN KALYAN: తెలంగాణ సమగ్ర అభివృద్దే లక్ష్యం.. జనసేన, బీజేపీ సమన్వయంతో పని చేయాలి: పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. అసలే చలికాలం.. పైగా వర్షాలు.. చల్లటిగాలులు కూడా వీస్తున్నాయి. గురువారం నాడు కేటీఆర్, రేవంత్ రెడ్డి వర్షంలో తడుస్తూనే ప్రచారం చేశారు. శుక్రవారం నాడైతే చాలా చోట్ల భారీ వర్షం కురిసింది. దాంతో లీడర్ల సభలకు ఆటంకం కలిగింది. ఢిల్లీ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వరంగల్ జిల్లాలో పర్యటనకు ఆటంకం కలిగింది. పాలకుర్తి సభకు హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉంది. కానీ వెదర్ బాగోలేకపోవడంతో రోడ్డు మార్గంలో చేరుకోవాల్సి వచ్చింది. దాంతో పాలకుర్తి కాంగ్రెస్ సభ ఆలస్యంగా మొదలైంది. లేట్ అయినందుకు ప్రియాంక సారీ కూడా చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అంతటా ఉదయం నుంచి చలిగాలులు వీస్తున్నాయి. చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. TPCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డి నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కొద్ది దూరం వెళ్ళి మళ్ళీ హైదరాబాద్‌కి తిరిగి వచ్చింది.

DK Shivakumar: మొదటిరోజే ఆరు గ్యారెంటీల హామీలపై సంతకం చేస్తాం: డీకే శివకుమార్

చలిగాలులు, భారీ వర్షాలతో వాతావరణం ఇలాగే ఉంటే.. బహిరంగ సభలకు జనం రావడం కష్టమేనని పార్టీల నేతలు టెన్షన్ పడుతున్నారు. నియోజకవర్గాల్లో ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుగుతున్న లీడర్ల పరిస్థితి కూడా దారుణంగా ఉంటోంది. తమతో పాటు కార్యకర్తలు కూడా వానలో తడుస్తూ.. చలికి వణుకుతూ ప్రచారం చేసుకుంటున్నారు. నవంబర్ 25న సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌లో జరగాల్సిన సీఎం కేసీఆర్ సభ కూడా రద్దయింది. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థుల కోసం ఈ బహిరంగ సభ పెట్టాలనుకున్నారు. మరో రెండు, మూడు రోజులు పాటు వానలు పడే అవకాశం ఉండటంతో సభను రద్దు చేసినట్టు బీఆర్ఎస్ ప్రకటింది. అభ్యర్థులకే కాదు.. ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్న ఎలక్షన్ సిబ్బంది కూడా ఇబ్బంది పడుతున్నారు. ఓటింగ్ అవేర్నెస్ కార్యక్రమాలపై వర్షం ఎఫెక్ట్ పడింది. అధికారులు వర్షంలో తిరుగుతూనే ఓటు విలువపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తోంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ డేటా ప్రకారం శుక్రవారం హైదరాబాద్‌లో 10 మిల్లీ మీటర్ల వర్షం పడింది.

భద్రాద్రి కొత్తగూడెం, కుమరం భీమ్, నిర్మల్, సూర్యాపేట, వికారాబాద్ జిల్లాలోనూ వానలు కురిశాయి. రాబోయే రెండు రోజుల్లో హైదరాబాద్‌తో పాటు జనగాం, కరీంనగర్, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దాంతో ఈ నాలుగు రోజులు ప్రచారం ఎలా చేసుకోవాలా అని పార్టీల నేతలు, అభ్యర్థులు టెన్షన్ పడుతున్నారు.