RAJA SINGH: ఆయనుంటే నేను రాను.. అక్బరుద్దీన్‌ ముందు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనంటున్న రాజా సింగ్..

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. వీళ్లందరితో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణస్వీకారం చేయిస్తారు. అయితే.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా రాజాసింగ్‌ వ్యతిరేకించారు.

  • Written By:
  • Publish Date - December 8, 2023 / 06:14 PM IST

RAJA SINGH: తెలంగాణలో కొత్త అసెంబ్లీ ఇంకా కొలువదీరనేలేదు. అప్పుడే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ను ఎన్నుకోవడంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడవ అసెంబ్లీ ఎన్నికల తరువాత మొదటి శాసనసభ సమావేశం జరగబోతోంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. వీళ్లందరితో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణస్వీకారం చేయిస్తారు. అయితే.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా రాజాసింగ్‌ వ్యతిరేకించారు.

Akbaruddin Owaisi: తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్.. రేపటి నుంచి అసెంబ్లీ

అక్బరుద్దీన్‌ తప్ప వేరే సీనియర్‌ ఎవరూ దొరకలేదా అంటూ కాంగ్రెస్‌ను ప్రశ్నించారు. అక్బరుద్దీన్‌ ప్రొటెం స్పీకర్‌గా ఉంటే తాను ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయబోనంటూ చెప్పారు. అంతా ప్రమాణస్వీకారం చేసి స్పీకర్‌ను ఎన్నుకున్న తరువాత తాను ప్రమాణస్వీకారం చేస్తానంటూ చెప్పారు. దీంతో ఈ అంశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. నిజానికి అసెంబ్లీలో ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించాలి. తెలంగాణ అసెంబ్లీలో ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో అందరికంటే మాజీ సీఎం కేసీఆర్‌ మాత్రమే సీనియర్‌ ఎమ్మెల్యే. కానీ కాలికి గాయం కారణంగా ఆయన రెండు నెలల పాటు అసెంబ్లీకి రాలేని పరిస్థితి ఏర్పడింది.

దీంతో ఆయన తరువాత ఎవరు సీనియర్‌ అయితే వాళ్లను ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకోవాల్సి ఉంటుంది. కేసీఆర్‌ తరువాత సీనియర్లు చాలా మంది ఉన్నా.. అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకోవడాన్ని రాజాసింగ్‌ వ్యతిరేకించారు. మరి తొలి అసెంబ్లీ సమావేశంలో ఆయన ఏం చేయబోతున్నారో చూడాలి.