RAJASTHAN EXIT POLLS: రాజస్థాన్‌లో కమల వికాసం.. కాంగ్రెస్‌కు ఓటమి తప్పదా ?

రాజస్థాన్ లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన 9 సర్వేల్లో 8 కూడా గెహ్లాట్ ఓటమిని ఖాయం చేశాయి. గత మూడు దశాబ్దాల్లో రాజస్థాన్ లో ఏ పార్టీ కూడా వెంటనే రెండోసారి అధికారం దక్కించుకోలేదు. అదే పరిస్థితి ఇప్పుడు రిపీట్ కాబోతోంది.

  • Written By:
  • Publish Date - November 30, 2023 / 08:23 PM IST

RAJASTHAN EXIT POLLS: 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీలో ఈసారి కమలం వికసిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతుందని అంటున్నాయి. రాజస్థాన్ లో 200 సీట్లల్లో 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కరాన్ పూర్ కు చెందిన గుర్మీత్ కూనర్ పోలింగ్ కి ముందు చనిపోయారు. దాంతో మ్యాజిక్ ఫిగర్ 101 కే పరిమితం అయింది. అయితే రాజస్థాన్ లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన 9 సర్వేల్లో 8 కూడా గెహ్లాట్ ఓటమిని ఖాయం చేశాయి.

TS EXIT POLLS: కాంగ్రెస్‌కే మొగ్గు.. అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే..!

గత మూడు దశాబ్దాల్లో రాజస్థాన్ లో ఏ పార్టీ కూడా వెంటనే రెండోసారి అధికారం దక్కించుకోలేదు. అదే పరిస్థితి ఇప్పుడు రిపీట్ కాబోతోంది. కాంగ్రెస్ స్థానంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ రాష్ట్రంలో నవంబర్ 25నాడు ఒకే దఫాలో ఎన్నికలు జరిగాయి. ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడి అవుతాయి. కాంగ్రెస్ సీనియర్ లీడర్ అశోక్ గెహ్లాట్ నాలుగోసారి సీఎం అవ్వాలన్న కల నెరవేరేలా లేదు. అయితే బీజేపీ అధికారంలోకి వస్తుంది కానీ.. స్ట్రాంగ్ మెజారిటీతో మాత్రం కాదంటున్నాయి సర్వేలు. రిపబ్లిక్ టీవీ – మ్యాట్రిజ్ నిర్వహించిన ఎగ్జిట్ సర్వే ప్రకారం బీజేపిక 115 నుంచి 130 సీట్లు దక్కే ఛాన్సుంది. కానీ టైమ్స్ నౌ –ETG సర్వే మాత్రం 108 నుంచి 128 స్థానాలు కమలం పార్టీకి వస్తాయంటోంది. కాంగ్రెస్ కి 75కు మించి స్థానాలు గెలుచుకునే అవకాశం లేదట. మిగతా ఎగ్జిట్ పోల్స్ పరిశీలిస్తే.. జన్ కీ బాత్, పి-మార్ఖ్, టీవీ9 భరత్ వర్ష్- పోల్ స్ట్రాట్ .. ఇవన్నీ కూడా బీజేపీకి 100 సీట్లు దాకా వస్తాయని చెబుతున్నాయి.

ఒకటి రెండు సర్వేలు మాత్రం కమలం పార్టీ 120కి మించి గెలుచుకుంటుందని అంటున్నాయి. అయితే ABP News-C voter, దైనిక్ భాస్కర్ సంస్థలైతే బీజేపీ భారీ మెజారిటీతో రాజస్థాన్ లో అధికారం దక్కించుకుంటుందని అంటున్నాయి. ఒక పార్టీ వెంట వెంటనే అధికారంలోకి వచ్చే సంప్రదాయం అనేది రాజస్థాన్ లో లేదు. 30యేళ్ళుగా జరుగుతున్న ఈ తంతును రాజస్థాన్ ఓటర్లు ఈసారి కూడా కంటిన్యూ చేయబోతున్నట్టు ఎగ్జిట్ పోల్స్ చూస్తే అర్థమవుతోంది.