REVANTH REDDY: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రజినీ అనే దివ్యాంగురాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ఉద్యోగం ఆమెకే ఇస్తూ నియామక పత్రాన్ని అందించారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మొదటి రజినీకి ఉద్యోగం ఇచ్చారు. తరువాత సెక్రటేరియట్‌కు వెళ్లారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఉద్యోగం పొందిన మహిళగా నిలిచారు రజినీ. అయితే రజినీకి రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగం ఏంటి? ఆ ఉద్యోగానికి జీతం ఎంత? ఇప్పుడు అందరిలో ఉన్న డౌట్ ఇదే.
WOMEN RTC FREE: మహిళలకు ఉచిత ప్రయాణం.. వారం రోజుల దాకా ఐడీ కార్డ్ అక్కర్లేదు !
తాను ఇచ్చిన మాట ప్రకారం రజినీకి స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉద్యోగం ఇప్పించారు రేవంత్ రెడ్డి. ఈ ఉద్యోగానికి రజినీ అందుకునే జీతం నెలకు రూ.50 వేలు. ప్రస్తుతానికి కాంట్రాక్ట్ బేస్‌లో రజినీని ఉద్యోగంలోకి తీసుకున్నారు. ఇంతకాలం ఎదురుచూసినందుకు మంచి ఉద్యోగం రావడంతో రజినీ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తన జీవితాన్ని నిలబెట్టిన రేవంత్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానంటూ ఎమోషనల్ అయ్యారు రజినీ. పుట్టుకతోనే మరగుజ్జుగా పుట్టిన రజినీ బాగా చదువుకుంది. గతంలో ఉద్యోగం కోసం చాలా మందిని కలిసింది. కానీ ప్రతీ చోటా ఆమెకు నిరాశే ఎదురైంది. కొన్ని రోజుల క్రితం గాంధీ భవన్‌లో రేవంత్ రెడ్డిని కలిసింది రజినీ.
తనకున్న కష్టాలను రేవంత్ రెడ్డికి వివరించింది. ఆమె కష్టాలు చూసి చలించిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ఉద్యోగం రజినీకే ఇస్తానంటూ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రజినీకి ఉద్యోగం ఇచ్చి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.