Rajini Saichand: తన పదవికి రాజీనామా చేసిన సాయిచంద్‌ భార్య రజినీ

అసెంబ్లీ రద్దు చేయడంతో పాటు.. వివిధ శాఖల చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఈ క్రమంలోనే సింగర్‌ సాయిచంద్‌ భార్య, తెలంగాణ గిడ్డంగుల శాఖ చైర్మన్‌ రజినీ తన పదవికి రాజీనామా చేశారు. ఇవాళ తన రాజీనామా పత్రాన్ని చీఫ్‌ సెక్రెటరీకి పంపించారు.

  • Written By:
  • Publish Date - December 4, 2023 / 08:14 PM IST

Rajini Saichand: తెలంగాణ తీర్పు మారిపోయింది. కారుకే మరోసారి పట్టం కడతారు అనుకుంటే.. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు షాకిచ్చారు. ఎవరూ ఊహించని మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టారు. ఎవరితో పొత్తు అవసరం లేకుండానే తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేబోతోంది కాంగ్రెస్‌ పార్టీ. ఇప్పటికే సీఎల్పీ మీటింగ్‌ కూడా నిర్వహించారు. రేపు సీఎంను ప్రకటించబోతున్నారు. అసెంబ్లీ నిర్వహించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అసెంబ్లీ రద్దు చేయడంతో పాటు.. వివిధ శాఖల చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు.

CONGRESS: కాంగ్రెస్‌లో అలజడి.. సీఎం పదవి కోసం సీనియర్ల మధ్య వాగ్వాదం!?

ఈ క్రమంలోనే సింగర్‌ సాయిచంద్‌ భార్య, తెలంగాణ గిడ్డంగుల శాఖ చైర్మన్‌ రజినీ తన పదవికి రాజీనామా చేశారు. ఇవాళ తన రాజీనామా పత్రాన్ని చీఫ్‌ సెక్రెటరీకి పంపించారు. సాయిచంద్‌ హార్ట్‌ ఎటాక్‌తో చనిపోయిన తరువాత ఆయన పదవిని ఆయన భార్య రజినీకి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఉద్యోగంలోనే తన భర్తను చూసుకుంటూ.. చైర్మన్‌ బాధ్యతలు స్వీకరించారు రజినీ. కానీ ఆనూహ్యంగా ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం మారిపోవడంతో.. ఆమె తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవలం రజినీ మాత్రమే కాదు.. వివిధ శాఖల్లో చైర్మన్‌లుగా పని చేస్తున్న బీఆర్ఎస్‌ నేతలంతా వరుసగా తమ పదవులకు రాజీనామా చేస్తున్నారు.

వాళ్ల స్థానంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు చైర్మెన్లుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రస్తుతం సీఎల్పీ మీటింగ్‌ ముగిసింది. సీఎం అభ్యర్థిని హైకమాండ్‌ ప్రకటించబోతుంది. తరువాత క్యాబినెట్‌ కూర్పు ఉంటుంది. ఈ తతంగం ముగిసిన తరువాత.. ఖాళీ ఐన అన్ని శాఖలకు చైర్మెన్లను కాంగ్రెస్‌ నియమించబోతోంది.