Rajini Saichand: కాంగ్రెస్‌లోకి సాయిచంద్‌ భార్య!? అందుకే పదవికి రాజీనామా చేయలేదా..

చైర్మన్లు అందరూ వరుసగా రాజీనామాలు చేస్తున్నా.. సింగర్‌ సాయిచంద్‌ భార్య, వేర్‌హౌజ్‌ కార్పొరేషన్‌ శాఖ చైర్మన్‌ రజినీ ఇప్పటి వరకూ రాజీనామా చేయలేదు. నిజానికి రజినీ తన పదవికి రాజీనామా చేశారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటికీ అదే పదవిలో కొనసాగుతున్నారు.

  • Written By:
  • Updated On - December 5, 2023 / 05:15 PM IST

Rajini Saichand: తెలంగాణలో ప్రభుత్వం మారిపోయింది. 64 స్థానాల్లో తిరుగులేని మెజార్టీతో హస్తానికి అధికారం అందించారు తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్‌ నుంచి తెలంగాణ కొత్త సీఎం, మంత్రులు ప్రమాణస్వీకారానికి కూడా రెడీ అయ్యారు. అసెంబ్లీ రద్దుతో ఎమ్మెల్యేలంతా మాజీ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక కార్పొరేషన్‌ చైర్మన్లు కూడా తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. బోయిన్‌పల్లి వినోద్‌ కుమార్‌, మన్నె క్రిశాంక్‌, గెల్లు శ్రీనివాస్‌, పాటిమీది జగన్‌ లాంటి ఉద్యమ నేతలు కూడా పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.

CONGRESS COUNCIL: కౌన్సిల్‌లో కాంగ్రెస్ సర్కార్‌కి కష్టాలే..! బిల్లులు ఆమోదం పొందేది ఎలా..?

చైర్మన్లు అందరూ వరుసగా రాజీనామాలు చేస్తున్నా.. సింగర్‌ సాయిచంద్‌ భార్య, వేర్‌హౌజ్‌ కార్పొరేషన్‌ శాఖ చైర్మన్‌ రజినీ ఇప్పటి వరకూ రాజీనామా చేయలేదు. నిజానికి రజినీ తన పదవికి రాజీనామా చేశారని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటికీ అదే పదవిలో కొనసాగుతున్నారు. దీంతో ఆమె కాంగ్రెస్‌లోకి వెళ్లబోతోందా అనే అనుమానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్‌ హయాంలో కూడా రజినినీ అదే పదవిలో కంటిన్యూ చేసే ఆఫర్‌ వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్‌ కారణంగా పార్టీ మారేందుకు రజినీ రెడీ అయినట్టు రాజకీయ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. సింగర్‌ సాయిచంద్‌ను పొలిటీషన్‌గా చూడటంకంటే.. కళాకారుడిగానే అంతా చూశారు. కాంగ్రెస్‌లో కూడా సాయిచంద్‌ను అభిమానించేవాళ్లు ఉన్నారు. అలాంటి కళాకారుడికి గౌరవం ఇవ్వాలనే రజినికి కాంగ్రెస్‌ ఈ ఆఫర్‌ ఇచ్చినట్టు తెలుస్తోంది.

అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సీఎం క్యాండెట్‌, పోర్ట్‌ఫోలియోల విషయంలో కాంగ్రెస్‌ బిజీగా ఉంది. మంత్రివర్గం కొలువుదీరిన తరువాత.. కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించే చాన్స్‌ ఉంది. ఈ నియామకం ప్రాసెస్‌లోనే రజినీ పేరును కూడా ప్రకటిస్తారనే టాక్‌ వినిపిస్తోంది. ఇది ఎంతవరకూ నిజమో చూడాలి మరి.