Rajinikanth: తెలంగాణ కొత్త గవర్నర్‌గా రజినీకాంత్‌ !?

తమిళ్‌తో పాటు తెలుగులో రజినీకాంత్‌కు పిచ్చి ఫాలోయింగ్‌ ఉంది. తెలుగు హీరోలతో సమానంగా క్రేజ్‌ ఉంది. ఈ కారణంగానే ఆయనను తెలంగాణకు గవర్నర్‌గా పంపితే ఇక్కడి ప్రజలను ఆకట్టుకోవచ్చనే యోచనలో బీజేపీ హైకమాండ్‌ ఉన్నట్టు టాక్‌ నడుస్తోంది. అంతే కాదు.

  • Written By:
  • Publish Date - September 6, 2023 / 04:38 PM IST

Rajinikanth: సినీ ప్రముఖుల గురించి ఏదైనా న్యూస్‌ బయటికి వస్తే క్షణాల్లోనే అది వైరల్‌గా మారిపోతుంది. దాని గురించి వచ్చే గాసిప్ప్‌ అన్నీ ఇన్నీ కావు. విన్నది విన్నట్టు చూసింది చూసినట్టు కాకుండా మసాలా యాడ్‌ చేసి మరీ స్ప్రెడ్‌ చేస్తుంటారు కొందరు వ్యక్తులు. ఇప్పుడు సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ గురించి కూడా అలాంటిదే ఓ వార్త ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ను త్వరలోనే తెలంగాణకు గవర్నర్‌గా పంపబోతున్నారంటూ ఇంటర్నెట్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

తమిళ్‌తో పాటు తెలుగులో రజినీకాంత్‌కు పిచ్చి ఫాలోయింగ్‌ ఉంది. తెలుగు హీరోలతో సమానంగా క్రేజ్‌ ఉంది. ఈ కారణంగానే ఆయనను తెలంగాణకు గవర్నర్‌గా పంపితే ఇక్కడి ప్రజలను ఆకట్టుకోవచ్చనే యోచనలో బీజేపీ హైకమాండ్‌ ఉన్నట్టు టాక్‌ నడుస్తోంది. అంతే కాదు. ఇప్పుడున్న గవర్నర్‌ తమిళసైకి సీఎం కేసీఆర్‌కు చాలా కాలంగా రిలేషన్స్‌ బాలేవు. ఇద్దరు బహిరంగంగానే విమర్శించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్‌లో గవర్నర్‌ను మార్చాలి అని కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందట. ఈ నేపథ్యంలో రజినీ అయితే, బాగుంటుంది అని బీజేపీ భావిస్తోందనే ప్రచారం నడుస్తోంది.

అయితే ఈ వార్తలను రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణరావు ఖండించారు. రజినీకాంత్‌కు ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ఇంట్రెస్ట్‌ లేదంటూ చెప్పారు. ఆయనకు గవర్నర్‌గా అవకాశమిస్తే మంచిదే కానీ.. రజినీకాంత్‌ మాత్రం ఆ పదవి కోసం ఆశపడటంలేదని చెప్పారు.