భుజాలు తడుముకున్న రకుల్ ప్రీత్

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద భూకంపమే సృష్టిస్తున్నాయి. రాజకీయ సినీ ప్రముఖులు ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొండా సురేఖకు ఇప్పటికే అక్కినేని నాగార్జున... లీగల్ నోటీసులు పంపించారు.

  • Written By:
  • Publish Date - October 4, 2024 / 09:30 AM IST

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద భూకంపమే సృష్టిస్తున్నాయి. రాజకీయ సినీ ప్రముఖులు ఆమె చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొండా సురేఖకు ఇప్పటికే అక్కినేని నాగార్జున… లీగల్ నోటీసులు పంపించారు. అయితే కొండా సురేఖ మాత్రం తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. అయితే కేటిఆర్ విషయంలో మాత్రం ఆమె వెనక్కు తగ్గలేదు. కేటిఆర్ కు క్షమాపణ చెప్పేది లేదని తానే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు.

ఇక కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నేను ఈ అందమైన పరిశ్రమలో చాలా గొప్ప ప్రయాణం చేసాను అలాగే ఇప్పటికీ తెలుగు సినిమాతో కనెక్ట్ అయి ఉన్నానని తెలిపిన ఆమె… ఇలాంటి నిరాధారమైన మరియు దుర్మార్గపు పుకార్లు తన సోదరిలాంటి మహిళలపై చేయడం దారుణం అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. మరింత నిరుత్సాహపరిచే విషయం ఏమిటంటే, చాలా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మరో మహిళ ఈ ఆరోపణలు చేయడం.

గౌరవం కోసం, మనం మౌనంగా ఉండాలని అనుకుంటాం. కాని అది మన బలహీనతగా అర్ధం చేసుకుంటారని ఆమె పేర్కొన్నారు. నేను పూర్తిగా రాజకీయ వ్యతిరేకిని, నాకు ఏ వ్యక్తి లేదా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. నా పేరును తప్పుడు పద్దతిలో వాడటంలో మానేయమని కోరుతున్నా అని పేర్కొంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా రాజకీయ స్వలాభం కోసం చేసిన కామెంట్స్ అని మండిపడ్డారు. కళాకారులను సినీ ప్రముఖులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరుతున్నాను అని తెలిపారు. సినీ ప్రముఖులను కల్పిత కథలకు ముడి పెట్టి మాట్లాడకుండా ఉండటం మంచిదని రకుల్ ప్రీత్ పోస్ట్ చేసింది. సమంతాకు మద్దతు ఇవ్వడం బాగానే ఉంది గాని అసలు కొండా సురేఖ… రకుల్ ప్రీత్ పై ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదు. కాని రకుల్ తన పేరుని వాడినట్టు చెప్పడం భుజాలు తడుముకున్నట్టే ఉంది అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.