RGV Vyuham: సినిమాలతో రాజకీయాలు ప్రభావితం అవుతాయా.. ఆర్జీవీ వ్యూహం ఏం చెబుతోంది..?

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్న తరుణంలో ఆర్జీవీ తెరకెక్కిస్తున్న వ్యూహం సినిమా మరింత అగ్గిరాజేసింది. ఇప్పటికే వ్యూహం అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ పార్ట్ 1 విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఇదే నేపథ్యంలో ఆగస్ట్ 15 న ఉదయం 11 గంటలకు వ్యూహం టీజర్ 2 విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 09:50 AM IST

ఈ సినిమా గురించి తాజాగా ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు వర్మ. విజయవాడ వేదికగా ప్రకాశం బ్యారేజ్ సాక్షిగా కొంత భాగం షూటింగ్ జరుగుతోందని తెలిపారు. ఇదిలా ఉంటే వ్యూహం ఎవరిని ఉద్ద్యేశించి తెరకెక్కిస్తున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి ఆర్జీవీపై ఫైర్ అయ్యారు. తెలుగుదేశం గురించి, మా గురించి తప్పుగా ఏమైనా సీన్లు చిత్రీకరిస్తే బట్టలూడదీస్తామని హెచ్చరించారు. దీనిపై స్పందించిన ఆర్జీవీ అతనికి ట్విట్టర్ వేదికగానే ధీటైన కౌంటర్ కూడా ఇచ్చారు.

వ్యూహం ఎన్నికల వ్యూహంలో భాగమా..

వివేక హత్య కేసులో తెలియని నిజాలను ప్రేక్షకులకు తనదైన ఆలోచనలతో తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు వర్మ. దీనిపై గతంలో జగన్ తో రెండు గంటలకు పైగా చర్చించినట్లు తెలుస్తుంది. కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించారన్న ప్రచారం కూడా సాగింది. గతంలో 2019 ఎన్నికలకు ముందు లక్ష‌్మీస్ ఎన్టీఆర్ పేరుతో బాబును డీగ్రేడ్ చేస్తూ చూపించారు. దీని ప్రభావం ఎన్నికలపై కచ్చితంగా పడింది. దీని పర్యావసానమే టీడీపీకి 23 సీట్లతో భారీ ఓటమి చవిచూసింది. ఇప్పుడు పూర్తి ఎన్నికలపై ప్రభావం పడటమే లక్ష్యంగా వ్యూహాన్ని తెరకెక్కిస్తున్నామని ఆర్జీవీ క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వడంతో దీనిపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ సినిమాలో రాజశేఖర్ రెడ్డి మరణం మొదలు జగన్ పాదయాత్ర కూడా ఉంటాయని కొందరి నోట వినిపిస్తున్న మాట. కానీ వ్యూహం ట్రైలర్ 1 చూస్తే.. వివేక హత్యతో పాటూ రాజశేఖర్ రెడ్డి పాత్ర కూడా కీలకంగా ఉందని అర్థమౌతుంది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. మొదటి పార్ట్ అక్టోబర్ లో విడుదల చేసి పార్ట్ 2 ను ఫిబ్రవరి నెలాఖరులో విడుదల చేయనున్నట్లు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఎన్నికల ముందే వీటిని విడుదల చేస్తామని ఈ సినిమా ప్రభావం రాజకీయాలపై పడాలనే ఉద్ధేశ్యంతోనే దీనిని తెరకెక్కిస్తున్నట్లు స్పష్టం చేశారు.

దీనిప్రభావం ఎంత

ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో చేసిన అరాచకాలను తీయడంలో వర్మ దిట్ట. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ లో కూడా చంద్రబాబు అండ్ ఫ్యామిలీని చాలా తక్కువ చేసి చూపించారు. దీంతో టీడీపీ మైలేజ్ పూర్తిగా పతనం అయింది. ఇప్పుడు సినిమా విడుదల చేయడం కాదు కదా.. జస్ట్ టీజర్ విడుదల చేస్తుంటేనే టీడీపీ నేతల వెన్నులో ఒణుకు మొదలౌతోంది. దీనిని మరింత అదునుగా భావించి వర్మ వ్యూహాన్ని తెరకెక్కిస్తే తెలుగు దేశం పార్టీకి రానున్న ఎన్నికల్లో మరో పరాభవం తప్పదని చెప్పాలి. పైగా జగన్ బయోపిక్ కూడా హనురాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. వైఎస్ఆర్ మరణం మొదలు జగన్ పడ్డ కష్టాలు, నష్టాలు, ప్రతికూలతలు, ముఖ్యమంత్రిగా ప్రమాణం వరకూ ఉంటుందని గతంలో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. జగన్ నమస్కారం చేసే స్టిల్ కూడా ఇందులో చూపించారు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది లేదా వచ్చే సంవత్సరం మార్చి, ఏప్రిల్ నాటికి విడుదలైతే టీడీపీ పై మరింత తీవ్ర వ్యతిరేకత రాక తప్పదు. ప్రస్తుతం ఏ మాధ్యమం వెళ్లలేనంత వేగంగా సినిమా మాధ్యమం ప్రజల్లోకి చొచ్చుకు పోతుంది. అక్కడ ఏం చూపిస్తే అదే నిజం అని చాలా వరకూ భావిస్తారు. దీంతో రానున్న 2024 ఏపీ రాజకీయాలు మరింత మంటెత్తేలా కనిపిస్తున్నాయి.

T.V.SRIKAR