Vijayashanthi : తగ్గేదేలే అంటున్న రాములమ్మ.. జెట్ స్పీడ్ తో కాంగ్రెస్ కి ప్రచారం

బీజేపీలో సముచిత స్థానం లేదంటూ కాంగ్రెస్ లో చేరిన విజయశాంతికి ఇక్కడ బాగానే గౌరవం దక్కుతోంది. ఆమెకు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్, ప్లానింగ్ కమిటీ కన్వీనర్ గా కూడా రెండు పోస్టుల్లో నియమించారు. ఇక హస్తం పార్టీ అభ్యర్థుల తరపున విజయశాంతి ప్రచారం చేయబోతున్నారు. క్యాంపెయిన్ ముగింపునకు టైమ్ దగ్గర పడటంతో.. కొన్ని జిల్లాల్లోనే ఆమె జెట్ స్పీడ్ తో ప్రచారాలు చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

 Mexico tower collapsed : మెక్సికోలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన టవర్.. ఐదుగురు కార్మికులు దుర్మరణం

బీఆర్ఎస్ తో బీజేపీ రాజీపడటం వల్లే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరినట్టు విజయశాంతి చెబుతున్నారు. ఈటల రాజేందర్ పైనా పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. ఆయన వల్లే బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి మార్చారనీ.. కేసీఆర్ పెంచి పోషించిన వ్యక్తే… ఇప్పుడు బీజేపీ పతనానికి కారణం అయ్యారని ఆరోపించారు. బీఆర్ఎస్ – బీజేపీ ఒప్పందం తర్వాతే సంజయ్ ను తప్పించారని అంటున్నారు. కమలం పార్టీ తనకు గుర్తింపు ఇవ్వకపోవడంతో అక్కడ ఉండలేకపోయారు రాములమ్మ. కాంగ్రెస్ లోకి రాగానే ఆమెకు మంచి స్థానం కల్పించింది ఆ పార్టీ అధిష్టానం. తెలంగాణలో ఎన్నికల కోసం ప్రచార కమిటీ, ప్రణాళిక సంఘం అనే రెండు కమిటీలను నియమించింది. ఈ రెండింటిలోనూ ఆమెకు పదవులు ఇచ్చారు. ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో విజయశాంతి ప్రచారం చేయబోతున్నారు. టైమ్ తక్కువగా ఉండటంతో ఈ ఏరియాల్లో క్యాంపెయిన్ ను స్పీడప్ చేయాలని ఆమె నిర్ణయించారు.

సీఎం కేసీఆర్ ను అధికారం నుంచి దింపడమే తన లక్ష్యమని ముందు నుంచీ చెబుతున్నారు రాములమ్మ. అందుకే ఈ ప్రచారంలో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల అవినీతినే ప్రధానంగా హైలెట్ చేయబోతున్నారు. అలాగే బీజేపీ – బీఆర్ఎస్ మధ్య బంధం ఉందనీ.. అందుకే కేసీఆర్ తో పాటు కవితపై యాక్షన్ తీసుకోవడం లేదని ప్రచారంలో జనానికి చెప్పాలని ప్లాన్ చేశారు. మొదట ఆమె మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావుకు మద్దతుకు రోడ్ షో చేయబోతున్నారు. గతంలో అదే పార్లమెంట్ సీటును విజయశాంతి గెలిచారు. అంతేకాకుండా మెదక్ లో పోటీ తీవ్రంగా ఉండటంతో.. మైనంపల్లి హన్మంతరావు ప్రత్యేకంగా విజయశాంతితో తనక కొడుకు కోసం ప్రచారం చేయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈనెల 28న క్యాంపెయిన్ ముగిసేలోపు విజయశాంతి ఎక్కడెక్కడ ప్రచారం చేయాలని క్యాంపెయిన్ కమిటీలో ఇప్పటికే డిసైడ్ చేశారు.