Guntur Politics: గుంటూరుకు ఏమైంది.. కోడెల, రాయపాటి వారసులు ఎందుకు వెనకబడ్డారు..?

రాయపాటి, కోడెల కుటుంబాలు ఇప్పుడు జిల్లాలో రాజకీయంగా కనుమరుగు అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని చనిపోగా.. రాయపాటి సాంబశివరావు వయోభారంతో యాక్టివ్‌ పాలిటిక్స్‌ చేయలేకపోతున్నారు.

  • Written By:
  • Publish Date - January 28, 2024 / 07:20 PM IST

Guntur Politics: ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో.. ప్రత్యేకించి గుంటూరు పాలిటిక్స్‌ని శాసించిన కోడెల, రాయపాటి కుటుంబాలు ఇప్పుడెందుకు కనుమరుగవుతున్నాయి..? వారసులు రాజకీయాల్లో ఉన్నా.. రాణించలేకపోవడానికి కారణాలేంటి..? కుటుంబ పెద్దల వారసత్వాన్ని కాపాడలేక.. కోడెల, రాయపాటి చిన్నోళ్ళు చేతులెత్తేస్తున్నారా..?
గుంటూరు జిల్లా రాజకీయాల్లో పార్టీలు ఏవైనా.. ఆ రెండు కుటుంబాలకు స్థానం మాత్రం ప్రత్యేకం. ఒకరు పల్నాడు కేంద్రంగా రాజకీయాలు నడిపిస్తే, మరొకరు గుంటూరు ప్రాంతంలో తిరుగులేని నాయకుడిగా చలామణి అయ్యారు. తామున్న పార్టీల్లో టికెట్లు ఇప్పించాలన్నా.. అసలు జిల్లాలో ఏ పని కావాలన్నా ఈ రెండు కుటుంబాలే చేసేవి. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి పదవుల్లో చక్రం తిప్పారు ఈ రెండు కుటుంబాల పెద్దలు. అలాంటి రాయపాటి, కోడెల కుటుంబాలు ఇప్పుడు జిల్లాలో రాజకీయంగా కనుమరుగు అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని చనిపోగా.. రాయపాటి సాంబశివరావు వయోభారంతో యాక్టివ్‌ పాలిటిక్స్‌ చేయలేకపోతున్నారు. కానీ.. ఇప్పుడు ఇద్దరి వారసులు ఆ ఛరిష్మాను కొనసాగించలేకపోతున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇంకా చెప్పాలంటే స్వయంకృతాలతో అవకాశాలను చేజార్చుకుంటున్నారన్నది లోకల్‌ టాక్‌. పెద్దోళ్లకి ఉన్న ఓర్పు, నేర్పు కోడెల వారసుడు శివరామ్‌కు, రాయపాటి వారసుడు రంగబాబుకు లేవన్నది స్థానిక రాజకీయ పరిశీలకుల మాట. పాలిటిక్స్‌లో ఈ రెండూ చాలా ముఖ్యమని, అవి కొరవడటంవల్లే వారసులు ఇద్దరూ రాణించలేకపోతున్నారని అంటున్నారు.

India vs England: తొలి టెస్టులో భారత్ ఓటమి.. లక్ష్య చేధనలో వెనుకబడ్డ టీమిండియా

కష్టపడకుండానే వచ్చిన రాజకీయ వారసత్వం, ఆస్తులతో జూనియర్స్‌ ఇద్దరూ తేలిగ్గా పవర్ పొలిటీషియన్స్‌ అయిపోవాలన్న ఆలోచనతో ఉన్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయట వాళ్లని దగ్గరగా పరిశీలిస్తున్నవారికి. వివిధ సందర్భాల్లో వాళ్ళు స్పందిస్తున్న తీరు వాళ్ళనే డిఫెన్స్‌లో పడేస్తోందన్న అభిప్రాయం లోకల్‌గా బలపడుతోంది. రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్నది చరిత్ర చెప్పే వాస్తవం. నెగ్గడం సంగతి తర్వాత.. ముందు ఎక్కడ, ఎప్పుడు తగ్గాలో తెలిసిన వాళ్లే ఈ రంగంలో ఎదుగుతారన్న వాస్తవాన్ని గ్రహించకుండా, అవకాశాలు రాలేదంటూ ఇద్దరూ ఓవర్‌గా రియాక్ట్‌ అయి తమ ఉనికిని కోల్పోతున్నారనే మాట గుంటూరు పొలిటికల్‌ సర్కిల్స్‌లో గట్టిగానే వినిపిస్తోంది. ఒక నాయకుడితో అవసరం ఉందంటే.. చిట్ట చివరన ఉన్నా ముందుకు లాక్కు రావడం, ప్రస్తుతానికి పని లేదంటే.. వెనక్కు నెట్టేయడం రాజకీయ లక్షణం. ఆ వాస్తవాన్ని గ్రహించకుండా.. ఒకప్పుడు మమ్మల్ని వాడుకున్న పార్టీలు ఇప్పుడు ఎందుకు దూరం పెట్టేస్తున్నాయంటూ ఇన్‌స్టంట్‌గా రియాక్ట్‌ అవుతున్నారని, అది వాళ్ల రాజకీయ భవిష్యత్‌కే మంచిది కాదన్న సలహాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు తన కుటుంబం, తాను చేసిన సేవల్ని గుర్తుంచుకుని ఇప్పుడు టీడీపీ టిక్కెట్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారట కోడెల శివరామ్‌.

Vc Sajjanar: బస్సుల్లో 12 కోట్ల మహిళల ఉచిత ప్రయాణం.. అవసరమైతే వారి కోసం ప్రత్యేక బస్సులు..

కానీ ఆయన విషయంలో పార్టీ ఆలోచన వేరుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అసలు వారసుల వైఖరి వల్లే కోడెలకు ఆ పరిస్థితి వచ్చిందన్నది టీడీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ అట. అందుకే శివరామ్‌కు సత్తెనపల్లి టిక్కెట్‌ నిరాకరించారని, ఇప్పటికైనా వైఖరి మార్చుకుని పార్టీ అభ్యర్థికి సహకరిస్తే.. భవిష్యత్‌లో అవకాశాలు ఉంటాయని అంటున్నారు కొందరు టీడీపీ సీనియర్స్‌. అలా కాదని తనకు ఇప్పటికిప్పుడే ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ కావాలంటూ మొండిగా ముందుకు వెళ్తే నష్టపోయేది ఆయనే అన్నవాదన బలంగా ఉంది. మరోవైపు రాయపాటి రంగబాబు విషయంలో కూడా అదే వైఖరి ఉందంటున్నారు. టీడీపీ అధిష్టానానికి అందిన నివేదికల ప్రకారం ప్రజాదరణ పరంగా రంగబాబుకు అంత సీన్‌ లేదని తేలిందట. ఎన్నికల్లో టిక్కెట్‌ పట్టాలన్నా.. గెలుపు కొట్టాలన్నా.. ప్రజాదరణే ప్రామాణికం కాబట్టి ఆయన్ని లైట్‌ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రాజకీయ వారసులు ఇద్దరి భవిష్యత్‌ ఎలా ఉండబోతోందనన్న చర్చ జిల్లాలో గట్టిగానే జరుగుతోంది.