MLC Kavitha: అరెస్ట్ తప్పదని గుర్తించిందా… అందుకే వరస ఇంటర్వ్యూలా…?

KCR కుమార్తె ... MLC కవిత హఠాత్తుగా 3, 4 ఛానెల్స్ కి, పేపర్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎప్పటి లాగే కేంద్రాన్ని, బీజేపీని దుమ్మెత్తి పోశారు. కవిత ఇప్పుడెందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ బాగా జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - March 3, 2023 / 07:51 PM IST

KCR కుమార్తె … MLC కవిత హఠాత్తుగా 3, 4 ఛానెల్స్ కి, పేపర్స్ కి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎప్పటి లాగే కేంద్రాన్ని, బీజేపీని దుమ్మెత్తి పోశారు. జైలుకి పంపిస్తే ఏం చేస్తారు అని అడిగిన ప్రశ్నకు నేనేం చేస్తా అని బేలగా సమాధానం చెప్పారు. అరెస్ట్ చేస్టే ప్రజల దగ్గరకు వెళ్తా అని దీనంగా చెప్పారు కవిత. ఆమె ముఖంలో ఎక్కడ లేని దైన్యం కనిపించింది. లిక్కర్ కేసులో తన ప్రమేయం లేదని .. కేసుని ధైర్యంగా ఎదుర్కుంటానని చెప్పు కొచ్చారు కెసీఆర్ కుమార్తె.

ఇంటర్వ్యూ లు జరుగుతున్నంత సేపు కవిత  ముఖంలో చిరునవ్వు కనిపించలేదు. తాను ఫోన్లు ధ్వంసం చేయలేదని… సీబీఐ అడిగితే వాటిని ఇస్తానని చెప్పారు కవిత. ఐతే అసలు ఏడాదిలో అన్ని ఫోన్లు ఎందుకు మార్చారు… అని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అడగలేదు… ఆమె చెప్పలేదు. లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన వాళ్ళు తన ఫ్రెండ్స్ అని… తన స్నేహితులు అయినంత మాత్రాన వాళ్లపై కేసులు పెడతారా అని ఆమె ప్రశ్నించారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ఇంటర్వ్యూలు కనుక అసలు విషయం వదిలేసి మహిళ రిజర్వేషన్లు, BRS గొప్పతనం లాంటి విషయాలు వివరించారు కానీ.. సాధ్యమైనంత వరకు ముందుగానే సానుభూతి పొందాలనే ప్రయత్నం కనిపించింది కవితలో.

నిజామాబాద్ ఎంపీగా మళ్ళీ పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు కవిత స్పష్టంగా సమాధానం చెప్పలేదు. పార్టీ నిర్ణయిస్తుందని చెప్పి తప్పించుకున్నారు. తన ఆస్థులన్నీ కష్టపడి సంపాదించానని, కాస్ట్లీ కార్లు, బంజారాహిల్స్ లో 6 వేల గజాల ఇల్లు ఇవన్నీ కష్టపడి సంపాదించానని.. అందుకే వాటిని దాచుకోవాల్సిన అవసరం లేదని ధైర్యంగా అన్నారామే. మొత్తం మీద కవిత ఇప్పుడెందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారనే దానిపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ బాగా జరుగుతోంది.