ఏపీలో కూటమి సర్కార్నీ సృష్టించిన వాడే ఆ ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నాడు. తన ప్రభుత్వంలో పోలీసులను తానే బహిరంగంగా నిందిస్తున్నాడు. ఏపీ హోమ్ మినిస్టర్ అనిత ఆ పదవికి పనికిరాదు అంటున్నాడు. నేను హోమ్ మినిస్టర్ గా ఉంటే పరిస్థితి మరోలా ఉంటుందని హెచ్చరిస్తున్నాడు. ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడితే… దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? తెర వెనక ఏదో జరుగుతుందని భావించాలి కదా. పవన్ కళ్యాణ్ ఆగ్రహం అసహనం వెనక దాగి ఉన్న అసలు రహస్యం ఇది.
ఎవరు అంగీకరించినా…. అంగీకరించకపోయినా ఏపీలో కూటమి సర్కారు ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ మాత్రమే కారకుడు. బిజెపి టిడిపిలను కలిపి ఒక్క తాటిపైకి తెచ్చి, తాను 21 ఎమ్మెల్యే సీట్లకే పరిమితమై, ప్రచారం మొత్తాన్ని భుజాలు వేసుకొని రాత్రి పగలు janam లో తిరగడమే కాకుండా…. టిడిపి అధినేత చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా చంద్రబాబు కి, ఆయన కుటుంబానికి అండగా నిలబడిna వాడు పవన్. అంతేకాదు పవన్ కళ్యాణ్ ,జనసేన వలనే ఏపీలో కాపులు, బలిజలు ఇతర వెనుకబడిన కులాలంతా కూటమికి పట్టం కట్టారు.
పవన్ కళ్యాణ్ కోసమే కాపులంతా టిడిపి బిజెపిలకు ఓటు వేశారు.
ఇది దాచేస్తే దాగని నిజం. కానీ ఏపీలో కూటమి ప్రభుత్వ ఏర్పడిన ఐదు నెలలకి పవన్ కళ్యాణ్ ఊహించni విధంగా తన ప్రభుత్వం పైనే, తన పోలీసులపైనే, తన మంత్రి పైనే విమర్శలు sandhinchadam ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఇటీవల జనసేన, టిడిపి నేతల మధ్య లోపించిన సమన్వయం… puttukochina విభేదాలే. కొన్ని జిల్లాల్లో వైసీపీ నేతలు తమ పార్టీ అధికారాన్ని కోల్పోయాక తెలివిగా జనసేనలో దూరిపోతున్నారు. Prakasam జిల్లాలో బాలినేని, కృష్ణాజిల్లాలో సామినేని ఉదయభాను లాంటి నేతలు జనసేనలో చేరారు. కానీ నిన్నటి వరకు వాళ్లంతా టిడిపితో వన్ టూ వన్ ఫైట్ చేసిన వాళ్లే. హఠాత్తుగా వీళ్ళతో ippudu చేతులు కలిపి మనం మనం బాయ్ బాయ్ అనాలి అంటే టిడిపి వాళ్లకి కష్టంగా ఉంది.
ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల బాల్నేని విషయంలో నేరుగా కామెంట్ చేశాడు. నువ్వు జనసేనలో చేరిన…మాకు శత్రువు వే. నిన్ను వదిలిపెట్టం. Pavan కళ్యాణ్ కూడా నిన్ను కాపాడలేడు అని నేరుగా బాల్నేనిపై విమర్శలు గుప్పించాడు దామచర్ల. పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలోనూ చాలామంది వైసిపి నేతలు yennikala తరువాత టిడిపిలో చేరలేక తెలివిగా జనసేనలో దూరిపోతున్నారు. స్థానికంగా వాళ్లకి టిడిపి వాళ్లకి పొంతన కుదరటం లేదు. రాజీ అవడం లేదు. ఇటీవల లిక్కర్ షాపులు వేలంలో ఈ గొడవలన్నీ బయటపడ్డాయి. Ycp నుంచి జనసేనలోకి వచ్చిన వాళ్ళు ఎవరికీ లిక్కర్ షాపులు దక్కకుండా టిడిపి నేతలు అడ్డంపడ్డారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు daadulu కూడా చేసుకున్నారు. దెందులూరు లో ఎమ్మెల్యే చింతమనేని జనసేన నేతలపై విరుచుకుపడ్డాడు. ఇక పిఠాపురంలోనూ జనసేన టిడిపి నేతల మధ్య విభేదాలు బయట పడ్డాయి.
అలా అనేకచోట్ల లిక్కర్ షాపులు వేలం సందర్భంగా రెండు సోదర పార్టీలు సిగపట్లు పట్టాయి. చిత్రం ఏమిటంటే స్థానిక పోలీసులు ప్రతిచోట టిడిపి వాళ్లకే అండగా నిలబడడం, జనసేన నాయకుల్ని కొట్టడం పవన్ కళ్యాణ్ కి ఆగ్రహం తెప్పించింది. ఈ విభేదాలపై…. ఇప్పటివరకు చంద్రబాబు ఒక్కసారి కూడా స్పందించలేదు. అసలు తనకి విషయం తెలియదన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. జనసేనలో వైసిపి నేతల చేరిక అధికార కూటమిలో అగ్గి రాజేసింది. లిక్కర్ షాపుల వేలం సందర్భంగా అది మరింత ఎక్కువైంది.. పోలీసుల సపోర్టు ప్రతిచోట టిడిపి నేతలకి ఉండడం పవన్ కు ఆగ్రహం తెప్పించింది. అంతేకాదు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ బోర్డులో కనీసం ఐదు మందిni తన వాళ్లను memబర్లుగా వేయాలని కోరినప్పటికీ mugguriki మాత్రమే అవకాశం వచ్చింది. టీటీడీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కఠినంగా వ్యవహరించారు.
కేంద్ర మంత్రుల రికమండేషన్లు కూడా ఆయన పక్కన పెట్టేశారు. ఒక పక్క తన కార్యకర్తలను అవమానించడం, వాళ్లపై టిడిపి వాళ్ళే దాడులు చేయడం మరో పక్క తన మాటకు కూటమిలో విలువ లేకపోవడం ఇవన్నీ పవన్ కి కంపరం పుట్టించాయి. పోలీసులు తన విషయంలో వ్యవహరిస్తున్న తీరు కూడా పవన్ లో అసహనాన్ని సృష్టించింది. దీని ఫలితమే అనిత ను నేరుగా టార్గెట్ చేస్తూ విమర్శించడం, అలాగే పోలీసు అధికారులకు కూడా పవన్ వార్నింగ్ ఇవ్వడం. పవన్ ని అన్నిటికన్నా బాధ కలిగిస్తున్న విషయం జరుగుతున్న పరిణామాలు పై chandrababu నాయుడు ఒక్కసారి కూడా స్పందించకపోవడం. అందుకే పరోక్షంగా తన ఆగ్రహాన్ని, అసహనాన్ని ఇలా వెలగక్కాడు జన సేనాని. అయితే అసహనం త్వరలోనే పరిష్కారం అవుతుందా… లేక మున్ముందు కొత్త సమస్యలు సృష్టిస్తుందా అన్నది చూడాలి.