PM MODI: డీప్ ఫేక్ బారిన మోదీ.. వ్యవస్థకు పెను ముప్పు ఉందన్న ప్రధాని..

కార్యక్రమంలో ప్రధాని మోదీ డీప్ ఫేక్ టెక్నాలజీ గురించి మాట్లాడారు. "ఇటీవల తెలిసిన వాళ్లు నాకు ఓ వైరల్ వీడియో పంపించారు. అందులో నేను పాట పాడుతున్నట్టుగా ఉంది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ వీడియోలు రూపొందిస్తున్నారు. ఇది సమస్యాత్మకమైన అంశం.

  • Written By:
  • Publish Date - November 17, 2023 / 07:47 PM IST

PM MODI: ప్రస్తుతం డీప్ ఫేక్ టెక్నాలజీ ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. నటి రష్మిక మందన్నా, నటి కాజోల్‌, కత్రినా కైఫ్‌ సహా పలువురి డీప్ ఫేక్ వీడియోలు ఇటీవల వైరల్‌గా మారాయి. తాజాగా ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ ప్రధాని మోదీని కూడా వదల్లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఓ పాట పాడినట్టు డీప్ ఫేక్ వీడియో రూపొందింది. ఈ వీడియో వైరల్ కూడా అయింది. ఈ వీడియో ప్రధాని వరకు చేరింది. తనకు తెలిసిన వాళ్లు ఈ వీడియో చూపించారని ప్రధాని అన్నారు.

RAHUL GANDHI: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో కులగణన: రాహుల్ గాంధీ

ఢిల్లీలో బీజేపీ.. దీపావళి మిలన్ అనే కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ డీప్ ఫేక్ టెక్నాలజీ గురించి మాట్లాడారు. “ఇటీవల తెలిసిన వాళ్లు నాకు ఓ వైరల్ వీడియో పంపించారు. అందులో నేను పాట పాడుతున్నట్టుగా ఉంది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ వీడియోలు రూపొందిస్తున్నారు. ఇది సమస్యాత్మకమైన అంశం. ఇవి సమాజానికి అతిపెద్ద ముప్పుగా మారుతున్నాయి. డీప్ ఫేక్ వీడియోల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ తరహా వీడియోలపై మీడియా, పాత్రికేయులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాలి. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంపై ప్రజలను సన్నద్ధం చేయాలి. లాంటి వీడియోలు సమాజంలో గందరగోళానికి కారణం అవుతున్నాయి” అని మోదీ వ్యాఖ్యానించారు.

ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయినపుడు వాటిని ఫ్లాగ్‌ చేసి, వార్నింగ్‌ ఇవ్వాలని ఈ సందర్భంగా చాట్‌జీపీటీ బృందాన్ని తాను కోరినట్లు మోదీ తెలిపారు. ఈ వీడియోలపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలపై సోషల్ మీడియా సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని ఫిర్యాదు అందిన 36 గంటల్లోపు వాటిని తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు పాటించని సంస్థలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, సమాచార మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంటామని తెలిపింది.