TELANGANA ASSEMBLY: తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఎవరు అధికారపక్షం.. ఎవరు ప్రతిపక్షం అనే విషయం తేలిపోయింది. పదేళ్ల కారు ప్రస్తానానికి బ్రేక్ వేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 119 స్థానాల్లో మొత్తం 64 సీట్లు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. సీఎంను ప్రకటించడమే ఇక తరువాయి. సామాజికవర్గాల వారిగా తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేలను చూస్తే రెడ్డి సామాజికవర్గం నుంచే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం శాసనసభలో అడుగుపెట్టబోతున్న ఎమ్మెల్యేల్లో 43 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు.
AP Politics : పాలిటిక్స్ నుంచి.. ధర్మాన రిటైర్మెంట్ తప్పదా?
అయితే వీళ్లంతా ఒకే పార్టీ నుంచి లేరు. వివిధ పార్టీల నుంచి గెలిచారు. ఇక వెలమ సామాజికవర్గం నుంచి 13 మంది, కమ్మ సామాజికవర్గం నుంచి నలుగురు, బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి ఒకరు, వైశ్య సామాజికవర్గం నుంచి ఒకరు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇక బ్యాక్‌వర్డ్ క్లాస్ నుంచి కూడా పెద్దమొత్తంలోనే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. 19 మంది బీసీ ఎమ్మెల్యేలు ఈసారి ఎన్నికల్లో గెలిచారు. అలాగే 19 మంది ఎస్టీ ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. ఎస్టీ సామాజికవర్గం నుంచి 12 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ముస్లిం సామాజికవర్గం నుంచి ఏడు చోట్ల అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే ఇందులో ఒక్కరు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి లేకపోవడం విశేషం. దాదాపు అంతా మజ్లిస్ నుంచి ఉన్నారు.
ఇక రెడ్డి తరువాత ఎస్సీ, బీసీల హవా కొనసాగుతోంది. టికెట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజికవర్గానికే పెద్దపీఠ వేసింది. ఎక్కువ మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉండటానికి ఇది కూడా ఓ కారణం. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలు కూడా దాదాపు అన్ని పార్టీల నుంచి సమానంగా ఉన్నారు. కానీ ఏ రకంగా చూసినా.. ఈ సారి అసెంబ్లీలో కాస్ట్ పరంగా రెడ్డి డామినేషన్ ఎక్కువగా కనిపించబోతోంది.