షాక్: రోజాపై రేణు దేశాయ్ కేసు…? హైదరాబాద్ లో కేసు పెట్టనున్న రేణు దేశాయ్…?

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొండా సురేఖ కామెంట్స్ పై పెద్ద చర్చే జరుగుతోంది. కొండా సురేఖ చేసిన కామెంట్స్ దెబ్బకు ఒక్కసారిగా అక్కినేని ఫ్యామిలీ షాక్ అయింది. అసలు ఎందుకు ఆమె ఆ విమర్శలు చేసారు అనేది కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ.

  • Written By:
  • Publish Date - October 9, 2024 / 06:00 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొండా సురేఖ కామెంట్స్ పై పెద్ద చర్చే జరుగుతోంది. కొండా సురేఖ చేసిన కామెంట్స్ దెబ్బకు ఒక్కసారిగా అక్కినేని ఫ్యామిలీ షాక్ అయింది. అసలు ఎందుకు ఆమె ఆ విమర్శలు చేసారు అనేది కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ. హైడ్రాను డైవర్ట్ చేయడానికి కొండా సురేఖ ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు అనే చర్చ జరుగుతోంది. కొండా సురేఖ… తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుని సమంతాకు క్షమ్పానాలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో అక్కినేని ఫ్యామిలీ మాత్రం వెనక్కు తగ్గలేదు.

కొండా సురేఖపై పరువు నష్టం వేసి కోర్ట్ కి కూడా వెళ్ళారు. మంగళవారం కోర్ట్ లో అక్కినేని ఫ్యామిలీ వాదనలు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తాజాగా మరో విషయంలో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి ఆర్కే రోజాపై రేణు దేశాయ్ కేసు నమోదు చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై రోజా మాట్లాడారు. ఆ వ్యాఖ్యల్లో రోజా పెళ్ళిళ్ళు, విడాకుల గురించి కూడా మాట్లాడారు. ఈ నేపధ్యంలో రేణు దేశాయ్ కేసు నమోదు చేయాలని భావిస్తున్నారు.

అప్పట్లో తాను కేసు పెట్టాలనుకున్నా… రోజా మంత్రి కావడం, ఆమె పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తనకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేసు పెట్టలేదని రేణు దేశాయ్ తన సన్నిహితుల వద్ద తెలిపినట్టు సమాచారం. ఈ మేరకు లాయర్ తో కూడా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. అయితే పవన్ వైవాహిక జీవితంపై వైఎస్ జగన్ కూడా కామెంట్స్ చేసారు అప్పట్లో. అలాగే ఇతర వైసీపీ నేతలు కూడా పలుమార్లు కామెంట్స్ చేసారు. మరి వారిపై రేణు దేశాయ్ కేసు నమోదు చేస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.

అప్పట్లో వైసీపీ చేసిన మాటల యుద్దంతో పవన్ ను అభిమానించే వారు కూడా బాధ పడిన పరిస్థితి ఉంది. ఇక పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితంపై పెద్ద చర్చే జరిగింది కూడా. ఈ ప్రభావం పవన్ కళ్యాణ్ పిల్లలపై కూడా పడే అవకాశం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో కేసు పెట్టాలని రేణు దేశాయ్ భావిస్తున్నారు. ఈ విషయమై అవసరమైతే పవన్ కళ్యాణ్ తో కూడా చర్చించే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. ఇటీవల కూడా రోజా… పవన్ కళ్యాణ్ పై రోజా దూకుడుగా వ్యాఖ్యలు చేసారు. అయితే అధికారం కోల్పోయిన తర్వాత ఆమె స్వరంలో కాస్త మార్పు వచ్చింది.