ప్రస్తుతం R టీవీ పేరుతో ఓ మీడియా చానెల్ స్థాపించారు రవిప్రకాశ్. ప్రస్తుతం యూట్యూబ్‌లో మాత్రమే కనిపిస్తున్న ఈ చానెల్.. త్వరలో శాటిలైట్ టీవీగానూ మారబోతుందనే టాక్ వినిపిస్తున్నా.. అది ఎప్పుడు అంటే ప్రస్తుతానికి నో క్లారిటీ. ఇదంతా ఎలా ఉన్నా..గెంటేయడానికి కారణం అయిన వాళ్లే వెంటపడి ఒప్పించి మరీ రవిప్రకాశ్‌తో ఈ చానెల్ పెట్టించారని టాక్. రవిప్రకాశ్‌కు దూరం అయిన ఆయన సన్నిహితులు చెప్తున్న మాటలే ఇవి ! ఇదంతా ఎలా ఉన్నా.. రవిప్రకాశ్‌కు నేషనల్ పాపులర్ చానెల్ రిపబ్లిక్ టీవీ అదిరిపోయే షాక్ ఇచ్చింది. రవిప్రకాష్ R టీవీపై వంద కోట్ల రూపాయల దావా వేసింది. ట్రేడ్ మార్క్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్న ఆరోపణతో రవిప్రకాశ్‌పై.. ముంబై హైకోర్టులో ఈ దావా వేసింది రిపబ్లిక్ టీవీ యాజమాన్యం.
R అనే అక్షరంతో తమకు ట్రేడ్ మార్క్ ఉందని.. R టీవీ కూడా అదే అక్షరాన్ని ఉపయోగించడం అభ్యంతరకరం అంటూ రిపబ్లిక్ టీవీ వాదిస్తోంది. తమ ట్రేడ్‌మార్క్‌ను కాపీ చేసి.. తమ లోగోను పోలి ఉండే లోగో తీసుకువచ్చి రవిప్రకాశ్ మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. లోగోతో పాటు మూడు అక్షరాలు తొలగించాలని డిమాండ్ చేస్తూ దావా వేసింది. ఐతే 2007 నుంచే తాము Rటీవీ లోగోను ఉపయోగిస్తున్నామని రవిప్రకాష్ తరఫు లాయర్ ఆన్సర్ ఇచ్చారు. మరి ఇప్పుడేం జరుగుతుంది.. Rటీవీ యాజమాన్యం అక్షరాలు తీసేస్తుందా.. నిజంగా వందకోట్లు చెల్లిస్తుందా అన్న సంగతి ఎలా ఉన్నా… మీడియాతో పాటు రాజకీయవర్గాల్లో రవిప్రకాశ్ గురించి కొత్త చర్చ మొదలైంది.
రాజకీయ శక్తులు రవిప్రకాశ్‌ను తీవ్రంగా వెంటాడుతున్నాయ్. రవిప్రకాశ్ ఇప్పుడు రాజకీయవస్తువుగా మారారు అనడంలో ఎలాంటి అనుమాం లేదు అనే చర్చ జరుగుతోంది. ఎదిరించిన పార్టీని ఎదురెళ్లి మరీ ఆహ్వానం పలికి రవిప్రకాశ్ చానెల్ ఏర్పాటుకు సిద్ధం అవుతున్నారని ప్రచారం జరుగుతున్న వేళ.. ఆ పార్టీ ప్రత్యర్థులే రవిప్రకాశ్‌ను హాంట్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. దావా వేసింది రిపబ్లిక్ టీవీ. ఆ చానెల్ వెనక ఉన్నది ఎవరో దేశం అంతా తెలుసు. అలాంటి పార్టీ నుంచి Rటీవీ మీద కంప్లైంట్ రెయిజ్ అయిందంటే.. తెరవెనక ఏం జరుగుతుందో.. ఎలాంటి రాజకీయశక్తులు రవిప్రకాశ్‌ను వెంటాడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనే చర్చ జనాలతో పాటు మీడియావర్గాల్లో సాగుతోంది. ఒకప్పటి పరిస్థితులు కావు.. ఒకప్పటి రాజకీయాలు కావు. ఒక్కొక్కరిది ఒక్కో వ్యూహం. ఒక్కొక్కరిది ఒక్కో బలం. ఇప్పుడు వేసిన దావా శాంపిల్ మాత్రమే. ఇలా వెంటాడ్డాలు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయ్. మరి వీటన్నింటిని రవిప్రకాశ్ దాటుతారా.. దాటి నిలబడతారా అంటే.. వెయిట్ అండ్ సీ.