SAPTAGIRI TDP : ఏపీ ఎన్నికల్లో అలీకి పోటీగా సప్తగిరి.. ఒక్క ఛాన్స్ అంటూ టీడీపీకి రిక్వెస్ట్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గర పడుతున్న కొద్దీ టికెట్ ఆశిస్తున్న సెలబ్రిటీలు (Celebrities) ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు. స్టార్ కమెడియన్ నటుడు అలీకి ఇప్పటికే వైసీపీలో (YCP) సీటు కన్ఫర్మ్ అయింది. గడచిన ఐదేళ్లుగా ఆయన వైసీపీతోనే ప్రయాణిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గర పడుతున్న కొద్దీ టికెట్ ఆశిస్తున్న సెలబ్రిటీలు (Celebrities) ఇప్పుడిప్పుడు బయటపడుతున్నారు. స్టార్ కమెడియన్ నటుడు అలీకి ఇప్పటికే వైసీపీలో (YCP) సీటు కన్ఫర్మ్ అయింది. గడచిన ఐదేళ్లుగా ఆయన వైసీపీతోనే ప్రయాణిస్తున్నారు. నామినేటెడ్ పదవి ఇచ్చినా.. అలీ (Actor Ali) సంతృప్తి చెందకపోవడంతో.. ఆయన్ను ప్రత్యక్ష ఎన్నికల్లోకే దింపుతున్నారు ఏపీ సీఎం జగన్ (AP CM Jagan). టీడీపీ (TDP) కూడా ఒకరిద్దరు సినిమా నటులకి టికెట్లు ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తోంది. ఈ పరిస్థితుల్లో కమెడియన్ సప్తగిరి.. టీడీపీ టికెట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగానే టీడీపీ పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని కలిశారు.

సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికే.. చల్లా బాబుని కలిశానని సప్తగిరి చెబుతున్నా.. అసలు విషయం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడమే.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సప్తగిరి.. టీడీపీ తరఫున చిత్తూరు ఎంపీ లేదా పూతలపట్టు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పోటీ చేస్తానని కోరినట్లు సమాచారం. ఏపీలో టీడీపీ -జనసేన (TDP-Jana Sena) వేవ్ నడుస్తున్న సమయంలో.. సప్తగిరి లాంటివాళ్ళకి టికెట్ ఇచ్చి ఖర్చు మొత్తం పార్టీయే భరించాలంటే.. టీడీపీ కాస్త వెనకా ముందూ ఆలోచిస్తోంది. కమెడియన్ సప్తగిరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో కాటమరాయుడు సినిమా టైటిల్ ను మొదట తాను రిజిస్టర్ చేయించుకుని.. పవన్ కళ్యాణ్ పోరాటంతో ఎలాంటి షరతులు లేకుండా ఆయనకు ఇచ్చేశారు సప్తగిరి. కాటమరాయుడు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో సప్తగిరి చేసిన సాయాన్ని పవన్ కళ్యాణ్ ఒకటికి పది సార్లు ఘనంగా చెప్పారు కూడా.

సప్తగిరి మరి స్టార్ కమెడియన్ కాక పోయినా ఒక మాస్టర్ నటుడు. రాజకీయాల్లోకి రావాలని ఉద్దేశంతోనే పూతలపట్టు మిగిలిన ప్రాంతాల్లో అడపా దడపా.. చిన్నాచితకా సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇక పొలిటికల్ సీజన్ వచ్చేసింది కనుక నేరుగానే బరిలోకి దిగారు. మరోవైపు జనసేనలో కూడా నటుడు సప్తగిరి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. గతంలో ఆయన చంద్రబాబు అభివృద్ధి గురించి తెగ మెచ్చుకున్నాడు. నారా లోకేష్ ను పాదయాత్రలో కలిసినట్టు చెప్పారు. సినిమాల్లో లాగే రాజకీయాల్లో కూడా పేరు తెచ్చుకుంటానని స్టేట్ మెంట్ ఇచ్చాడు సప్తగిరి. చిత్తూరు జిల్లాతో తనకు అనుబంధం ఉన్నందున.. ఆ జిల్లా నుంచే పోటీ చేస్తానని సప్తగిరి ముందు నుంచీ చెబుతున్నాడు. అవసరమైతే టీడీపీ తరపున రాష్ట్రమంతటా క్యాంపెయిన్ కి రెడీ అంటున్నాడు మరి సప్తగిరికి టీడీపీ టికెట్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి.