ఏపీ టూర్ కు రేవంత్, షర్మిల భారీ స్కెచ్

ఆంధ్రప్రదేశ్ మీద కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ చేసింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. జిల్లా పార్టీ అధ్యక్షులను కూడా నియమించింది. త్వరలోనే మరిన్ని కీలక మార్పులు చేసే అవకాశం ఉందనే వార్తలు సైతం వస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - September 8, 2024 / 12:30 PM IST

ఆంధ్రప్రదేశ్ మీద కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ చేసింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. జిల్లా పార్టీ అధ్యక్షులను కూడా నియమించింది. త్వరలోనే మరిన్ని కీలక మార్పులు చేసే అవకాశం ఉందనే వార్తలు సైతం వస్తున్నాయి. ఇక వర్షాల ప్రభావం తగ్గిన తర్వాత రాష్ట్రంలో పర్యటనలు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అవసరమైతే బహిరంగ సభలు కూడా నిర్వహించే ప్లాన్ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల మీద కాంగ్రెస్ ఫోకస్ చేస్తోంది. పంచాయితీలలో మళ్ళీ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు.

అందుకే ఇప్పుడు కర్ణటక, తెలంగాణా కాంగ్రెస్ సహకారం తీసుకుంటుంది రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం. త్వరలోనే తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండే విధంగా ప్లాన్ చేస్తోంది పార్టీ నాయకత్వం. రేవంత్ రెడ్డికి ఏపీలో ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు వైసీపీ, టీడీపీ వ్యతిరేక ఓటుని తన వైపుకి తిప్పుకోవడమే కాకుండా కొందరు వైసీపీ నేతలను కాంగ్రెస్ లో జాయిన్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డిని రంగంలోకి దించాలని భావిస్తున్నారు. కర్నూలులో భారీ బహిరంగ సభను నవంబర్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

దీనికి ముఖ్య అతిధిగా రేవంత్ రెడ్డిని, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ని, కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణు గోపాల్ సహా పలువురు నేతలను ఆహ్వానించాలని భావిస్తున్నారు. అలా ఒక ఊపు క్రియేట్ చేసి వైసీపీ నేతలకు గాలం వేయాలని భావిస్తున్నారు. వైసీపీ నుంచి బయటకు వెళ్ళే వాళ్ళు జనసేన లేదా బిజెపి లో జాయిన్ అవుతున్నారు. కాబట్టి వారిని అటు వైపుకు వెళ్ళకుండా కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు షర్మిల ప్లాన్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వస్తే మాత్రం కచ్చితంగా ఊపు వచ్చే అవకాశం ఉందని షర్మిల లెక్కలు వేస్తున్నారు.

ఈనెల 11 న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం జరుగుతుంది. షర్మిల అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం జరుగుతుంది. పార్టీ బలోపేతంపై నూతనంగా నియమించబడ్డ డీసీసీలు,పార్టీ ఉపాధ్యక్షులు,జనరల్ సెక్రటరీలకు ఆమె దిశా నిర్దేశం చేసి… బహిరంగ సభపై కూడా చర్చించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇప్పుడే వైసీపీ నుంచి ఇతర పార్టీలకు చేరికలు ఉండే అవకాశం ఉంది కాబట్టి షర్మిల… కాస్త స్పీడ్ పెంచుతున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిన కొందరు కీలక నేతలను మళ్ళీ వైసీపీ నుంచి తీసుకునే ప్లాన్ చేస్తున్నారు షర్మిల.