ఆపరా నీ కాకి గోల: రేవంత్ ఫైర్

స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ ఇస్తానన్న వంద కోట్లను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదు అని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయొద్దని అదానీ గ్రూప్‌కు లేఖ రాశాం..

  • Written By:
  • Publish Date - November 25, 2024 / 04:32 PM IST

స్కిల్‌ యూనివర్సిటీకి అదానీ ఇస్తానన్న వంద కోట్లను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదు అని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. డబ్బు ట్రాన్స్‌ఫర్‌ చేయొద్దని అదానీ గ్రూప్‌కు లేఖ రాశాం.. అదానీ సంస్థ నుంచి రూ.100 కోట్లు స్వీకరించొద్దని నిర్ణయం తీసుకున్నామన్నారు. అనవసర వివాదాల్లోకి తెలంగాణ ప్రభుత్వాన్ని లాగొద్దు బీఆర్ఎస్‌ కూడా అదానితో చేసుకున్న ఒప్పందాలు చాలా ఉన్నాయని తెలిపారు.

కాంట్రాక్టులు, భూములు ఇచ్చింది వాళ్లు అని మండిపడ్డారు. గతంలో మీరు కేటాయించిన హైవేలు, డేటా సెంటర్లు.. మీరు కేటాయించిన వాటిపై కేసులు పెట్టాలి అన్నారు. ఢిల్లీ పర్యటన మంత్రివర్గ విస్తరణ కోసం కాదు అని స్పష్టం చేసారు. ఢిల్లీలో కాంగ్రెస్‌ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో భేటీ అవుతాను అన్నారు. వాళ్లలాగా గవర్నర్‌ అనుమతి ఇవ్వకుండా పైరవీల కోసం వెళ్లం.. మీ కడుపు మంట మాకు తెలుసు.. మీ కాకి గోల పట్టించుకోం అని స్పష్టం చేసారు.