JAIL CM’S: జైలు సెంటిమెంట్.. జైలుకెళితే సీఎం అవుతారా..?

పగ, ప్రతీకారం, పట్టుదల.. వీటి బేస్‌గా నాయకులు ఎన్నికల్లో నిలబడి మంత్రులు, ముఖ్యమంత్రులుగా మారుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జగన్, రేవంత్ రెడ్డి ఉదంతాలను చూసిన జనం ఇప్పుడు ఇదే మాట్లాడుకుంటున్నారు. జైలుకెళ్ళి వస్తే ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నారు.

  • Written By:
  • Publish Date - December 8, 2023 / 06:25 PM IST

JAIL CM’S: జైలుకెళితే సీఎం అవుతారా..? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. లీడర్స్ జైలుకెళ్తే.. ముఖ్యంగా నాయకులు చంచల్‌గూడ జైలుకెళ్ళి తిరిగివస్తే.. ముఖ్యమంత్రి అవుతున్నారు. భవిష్యత్తులో ఇదే సెంటిమెంట్‌గా మారుతుందా..? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమార్జన, మనీ లాండరింగ్, క్విడ్ ప్రోకో ఆరోపణలపై అరెస్టై 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. రిమాండ్ ఖైదీగా చంచలగూడ జైల్లో గడిపారు. అక్కడి నుంచే వైఎస్సార్సీపీ వ్యవహారాలను, వ్యూహాలను రచించేవాళ్ళు.

WOMEN RTC FREE: మహిళలకు ఉచిత ప్రయాణం.. వారం రోజుల దాకా ఐడీ కార్డ్ అక్కర్లేదు !

బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాక కూడా ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకి హాజరయ్యేవాడు. 2014 ఎన్నికల్లో ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయినా 60 పైగా సీట్లతో నిలబడగలిగారు. ఆ తర్వాత పాదయాత్ర చేయడం వల్ల 2019 ఎన్నికల్లో 151 సీట్ల బంపర్ మెజారిటీతో వైసిపి గెలిచింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు సేమ్ స్టోరీ తెలంగాణలో రిపీట్ అయింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకెళ్లారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు.. ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్‌కు 50 లక్షల రూపాయలు ఇవ్వబోతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఆ తర్వాత రెండు నెలలు చంచలగూడ జైల్లో ఉన్నారు. బెయిల్‌పై విడుదలయ్యారు. 2018 డిసెంబర్‌లో కేటీఆర్ ఫామ్‌హౌస్‌ని డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారని ఆరోపణలపై మరోసారి అరెస్టు అయ్యారు. అప్పుడు కూడా చంచలగూడలోనే ఉన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుంచి ఐదేళ్లపాటు రాష్ట్రంలో విపక్ష నేతగా పోరాడుతూనే ఉన్నారు.

చివరికి ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. పగ, ప్రతీకారం, పట్టుదల.. వీటి బేస్‌గా నాయకులు ఎన్నికల్లో నిలబడి మంత్రులు, ముఖ్యమంత్రులుగా మారుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జగన్, రేవంత్ రెడ్డి ఉదంతాలను చూసిన జనం ఇప్పుడు ఇదే మాట్లాడుకుంటున్నారు. జైలుకెళ్ళి వస్తే ముఖ్యమంత్రి అవుతారని అనుకుంటున్నారు. అయితే కొద్దిరోజుల క్రితం చంద్రబాబు నాయుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితునిగా 52 రోజులు పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు. జైలు సెంటిమెంటే నిజమైతే చంద్రబాబు నాయుడు కూడా రాబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రి కావాలి కదా అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అవుతారనే సెంటిమెంట్ ఉండేది. చివరికి అది ఇప్పుడు జైలుకెళితే సీఎం అవుతారనే సెంటిమెంట్‌గా మారింది.