Revanth Reddy: ఆటో డ్రైవర్లకు సీఎం గుడ్‌న్యూస్.. ఐదు లక్షల బీమా

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్, ఆటో డ్రైవర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న రేవంత్.. పలు హామీలిచ్చారు.

  • Written By:
  • Publish Date - December 24, 2023 / 02:01 PM IST

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా ఆటోడ్రైవర్ల ఆదాయానికి గండిపడ్డ సంగతి తెలిసిందే. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తుండటంతో ఆటోలు ఎక్కే వాళ్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. క్యాబ్ డ్రైవర్లకు ఇబ్బంది కలుగుతోంది.

Political Parties : వ్యూహకర్తలు నిజంగా గెలిపిస్తారా..?

దీంతో ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు తమ భవిష్యత్ గురించి ఆందోళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్ స్పందించారు. వారికి గుడ్ న్యూస్ చెప్పారు. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్‌ల కోసం రూ.5 లక్షల యాక్సిడెంటల్ పాలసీ తీసుకురానున్నట్లు తెలిపారు. అంతేకాదు.. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్, ఆటో డ్రైవర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్న రేవంత్.. పలు హామీలిచ్చారు.

అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రత కోసం రాజస్థాన్‌‌లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే, తెలంగాణలో బడ్జెట్ సమావేశాల్లో సమర్ధవంతమైన చట్టాన్ని ప్రవేశపెడతామన్నారు. క్యాబ్ డ్రైవర్ల కోసం టీ హబ్ ద్వారా ఒక యాప్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. నాలుగు నెలల క్రితం హైదరాబాద్‌లో కుక్క తరిమితే భవనంపై నుంచి పడి మృతి చెందిన స్విగ్గి డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం సహాయనిది నుంచి రూ.2 లక్షలు అందించాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.