REVANTH REDDY: తూటాకి కూడా లేని పవర్ మాటకు, పాటకు ఉంటుంది. ఒక్క పాట వేల మందిని ఉత్తేజపరుస్తుంది. వందల మందిని కదిలిస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఓ ఉద్యమాన్ని పుట్టిస్తుంది. పాటలకు అంత పవర్ ఉంటుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో కూడా ఓ పాట ఇదే పని చేసింది. 2021 జూలై 7న టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. తెలంగాణలో దాదాపు కనుమరుగైపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు.. నియమాలను పక్కన పెట్టి రేవంత్‌కు టీపీసీసీ పగ్గాలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం.
CM REVANTH REDDY: హాస్పిటల్‌లో కేసీఆర్.. వైరల్ అవుతున్న సీఎం రేవంత్ ట్వీట్
టీపీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆయన అభిమానులు ఆయనకోసం ప్రత్యేకంగా ఓ పాట రూపొందించారు. మూడు రంగుల జెండా పట్టి సింగమోలె కదిలినాడు అంటూ సాగే ఈ పాట.. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి యూట్యూబ్‌ను షేక్ చేసింది. కొన్ని రోజుల్లోనే ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారిపోయింది. అప్పటి నుంచి ఈ పాట లేకుండా ఏ కాంగ్రెస్ మీటింగ్ నడవలేదు. ఈ పాట పాడని కాంగ్రెస్ కార్యకర్త కూడా లేడు. అంతలా ప్రజల్లోకి వెళ్లిపోయింది ఈ సాంగ్. కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు రేవంత్ ఎంత కసితో ఉన్నాడు అనే ఫీవర్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో ఈ సాంగ్ కీరోల్ ప్లే చేసింది. లిరిక్స్‌తో పాటు బీట్ కూడా అద్భుంతంగా ఉండటంతో ప్రతీ ఒక్కరికి ఈ సాంగ్ రీచ్ అయ్యింది. దానికి తోడు నల్లగొండ గద్దర్ వాయిస్ కనెక్ట్ అయ్యింది. అప్పటి నుంచి మొన్న జరిగిన ఎలక్షన్ క్యాపెయినింగ్ వరకూ.. మూడు రంగుల పాట లేకుండా ఏ మీటింగ్ జరగలేదు.
ఆఖరికి ఢిల్లీ నుంచి ప్రచారానికి వచ్చిన ప్రియాకం గాంధీ కూడా ఈ పాటకు స్టెప్పులేశారు. అంటే జనాల్లో ఈ సాంగ్ ఎంత క్రేజ్ సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. 2021లో రిలీజైన ఈ సాంగ్‌కు ఇప్పటికే 10 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ ఈ సాంగ్ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతూనే ఉంది. అందుకే చాలా మంది ఈ పాటే రేవంత్‌ను సీఎంని చేసింది అని సరదాగా అంటూ ఉండారు. రేవంత్ సీఎం అవ్వడానికి ఈ పాట కారణమో కాదో చెప్పలేం కానీ.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపేందుకు మాత్రం ఈ సాంగ్ ఎంతగానో ప్లస్ అయ్యింది.