పార్టీని అయినా బలంగా మార్చుకుందా అంటే.. కాంగ్రెస్ ప్లేస్‌లోకి బీజేపీ వచ్చి చేరిందిప్పుడు తెలంగాణలో ! ఇంత జరుగుతున్నా.. పార్టీ ఇంతలా దిగజారుతున్నా.. ఎవరికి వారే అన్నట్లు ఉంటారు పార్టీలో ! రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నాక.. పరిస్థితి దారుణంగా మారింది. పార్టీలో గ్రూప్‌లు మొదలయ్యాయ్. సీనియర్లు వర్సెస్ జూనియర్లు అంటూ జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఢిల్లీ నుంచి దూత వచ్చి.. ఇంచార్జిని మార్చాల్సి వచ్చింది.
ఇదంతా ఎలా ఉన్నా.. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల మూడ్ స్టార్ట్ అయింది. మంటలు కూడా చిన్నబోయేంత వేడి కనిపిస్తోంది పార్టీల మధ్య. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అయితే అంతకుమించి అనిపిస్తోంది రచ్చ. ఎన్నికల రేసులో బీజేపీ, బీఆర్ఎస్ దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ ఆలస్యంగా పరుగులు పెట్టింది. మరి ఆ పరుగైనా సరిగా సాగుతుందా అంటే అదీ లేదు. రేవంత్ మీద రోజుకో సీనియర్.. గుస్సా అవుతున్నారు. దీనికి కారణం ఏంటని డీకోడ్ చేస్తే.. రేవంత్ వైపే చూస్తున్నాయ్ వేళ్లన్నీ ! ఆయన దూకుడు, అహంకార ధోరణే.. పార్టీకి ఇబ్బందులు తీసుకువస్తుందనే చర్చ జరుగుతోంది.
నిన్న ఏలేటి మహేశ్వర్ రెడ్డి పార్టీని వీడినా.. అంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి పార్టీని వీడినా.. అన్నింటికి కారణం రేవంత్‌తో పడకపోవడమే ! ఇప్పుడు పార్టీలో ఉన్న సీనియర్లు కూడా.. రేవంత్ మీద కోపంతోనే ఉన్నారు.. ఢిల్లీ మొహం చూసి అడ్జస్ట్ అయిపోతున్నారు అంతే ! వీహెచ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. ఇలా అందరు నేతలతోనూ రేవంత్‌కు దూరం పెరుగుతూనే ఉంది. ఇంత జరుగుతున్నా రేవంత్.. సీనియర్లను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారా అంటే అదీ లేదు. ఉండేవాళ్లే ఉంటారు అనేలా అహంకార ధోరణి చూపిస్తున్నారు.
మొదట్లో సీనియర్లను బుజ్జగించినట్లే కనిపించిన రేవంత్.. తర్వాత అంతా నా ఇష్టం అనే రేంజ్‌లో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. పార్టీ ఓటమికి రేవంతే కారణం అవుతారేమో ఒకరకంగా అనే అనుమానాలు మొదలయ్యాయి. నాయకుడికి నెగ్గడమే కాదు.. తగ్గడం కూడా తెలిసి ఉండాలి. పట్టుకోవడమే కాదు వదులుకోవడాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడే అంతా సాఫీగా సాగుతుంది. రేవంత్, కాంగ్రెస్ విషయంలో ఒకరకంగా మిస్ అవుతోంది అదే !
నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలం చెక్కుచెదరకుండా ఉంది. గట్టిగా కష్టపడాలే కానీ.. తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయ్. క్షేత్రస్థాయిలో ఆ రేంజ్‌లో స్ట్రాంగ్‌గా ఉంది బలం. ఐతే ఆ బలాన్ని తట్టి లేపే నాయకుడు కావాలి. రేవంత్ వర్సెస్ సీనియర్ల మధ్య కీచులాటతో.. కేడర్ ఇప్పుడు కన్ఫ్యూజన్‌లో పడుతుంది. అమాయకంగా గాల్లో దిక్కులు చూస్తుంది. విభేదాలు వీడి.. అంతా కలిసి నడిస్తే.. కాంగ్రెస్‌ను అడ్డుకోవడం బీఆర్ఎస్ తరం కూడా కాదు. ఇది పార్టీ నేతలంతా గుర్తుంచుకోవాల్సిన విషయం.