కొడంగల్ లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గంలో యువత,మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని స్పష్టం చేసిన ఆయన… కొడంగల్ ఎమ్మెల్యే గా నియోజకవర్గ అభివృద్ధి తన భాధ్యత అన్నారు. సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతానని నిలదీశారు.
కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసారు. భూసేకరణ పరిహారం పెంపు ను పరిశీలిస్తామన్న ఆయన… ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తనని కలిసిన వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసారు. లగచర్ల ఘటన పైన సీఎం కి వినతిపత్రం అందించారు వామపక్ష నాయకులు.