మాజీ మంత్రి కేటిఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేసారు. కొంత మంది దీపావళి అంటే చిచ్చు బుడ్లతో దావత్ చేసుకోకుండా సారా బుడ్ల తో దావత్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేసారు. దానికి గృహ ప్రవేశం అని పేర్లు పెట్టుకుంటున్నారన్నారు. దీపావళి పార్టీ అయితే పామ్ హౌజ్ లలో కొకైన్ తీసుకుంటారా..? అని నిలదీశారు. వీరు మనకు రోల్ మోడల్ గా ఉండాలా అంటూ ఎద్దేవా చేసారు. ఇక కేసీఆర్ పై మాట్లాడుతూ నువ్వు అక్కడే పడుకో… నిన్ను తెలంగాణ సమాజం మర్చిపోయిందన్నారు రేవంత్.
వస్తే అసెంబ్లీకి రా .. మంచి సూచనలు ఇవ్వు, ప్రతిపక్ష నేత హోదా లో మంచి సూచనలు ఇవ్వు అని హితవు పలికారు. బడి దొంగను చూసాం కానీ అసెంబ్లీ కి రాని దొంగను చూడలే అన్నారు రేవంత్. కెసిఆర్ అలా మారిపోయారని ఎద్దేవా చేసారు. గంజాయి కొకెన్ తీసుకుంటే పట్టుకోవద్దని కొందరు అంటున్నారని… ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకునే వాళ్లు రోల్ మోడల్ అవుతారా? అని ప్రశ్నించారు. తెలంగాణ సమాజం పదినెల్లో కోల్పోయిందని ఒకాయన అంటున్నారు.? ఏమి కోల్పోయింది .. మీ ఇంట్లో నలుగురు ఉద్యోగాలు పోయాయని ఎద్దేవా చేసారు.