REVANTH REDDY: ఈ ఇద్దరితో చిక్కులేనా..? రేవంత్‌కు చిక్కులు తప్పవా..?

రేసులో ఎంతమంది ఉన్నా.. అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ప్రకటించింది. దీంతో సీఎం పదవిపై రచ్చ తగ్గినట్లే అని అంతా అనుకున్నారు. ఐతే అది అంత ఈజీ కాదని.. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్థం అవుతోంది.

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 07:02 PM IST

REVANTH REDDY: తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్‌ ప్రమాణస్వీకారానికి అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయ్. ఢిల్లీ లెవల్‌లో పేరున్న చాలామంది నేతలు ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. రేవంత్‌తో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయ్. కాంగ్రెస్ గెలిచిన తర్వాత సీఎం రేసులో ఎవరు అని రకరకాల పేర్లు వినిపించాయ్. రేవంత్‌తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఇలా చాలామంది పేర్లు గట్టిగా వినిపించాయ్.

KONDA SUREKHA: డాషింగ్ లేడీ.. కొండా సురేఖ.. పట్టుబట్టి విజయం..

ఉత్తమ్‌, భట్టి అయితే.. ఏకంగా పార్టీ హైకమాండ్‌తో కూడా సీఎం పదవిపై చర్చలు జరిపారు. ఐతే రేసులో ఎంతమంది ఉన్నా.. అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రిగా ప్రకటించింది. దీంతో సీఎం పదవిపై రచ్చ తగ్గినట్లే అని అంతా అనుకున్నారు. ఐతే అది అంత ఈజీ కాదని.. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్థం అవుతోంది. ఉత్తమ్‌, భట్టి ఇంకా ఢిల్లీలోనే ఉన్నారు. తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌కు సీఎం పదవి కట్టబెట్టిన తర్వాత ఉత్తమ్‌, భట్టి అలకబూనినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇతర కాంగ్రెస్ నేతలంతా రేవంత్ రెడ్డికి విషెస్‌ చెప్పినా.. వీరిద్దరు మాత్రం సైలెంట్‌గానే ఉన్నారనే టాక్ పొలిటికల్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అయితే భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవి.. ఉత్తమ్‌కు మరో కీలక పదవి అప్పగించేందుకు అధిష్టానం సిద్ధమైనా.. ఈ ఇద్దరు మాత్రం సీఎం పదవే టార్గెట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీకి చిక్కులు తప్పవా అనే సందేహాలు వినిపిస్తున్నాయ్.

ఇప్పుడు రేవంత్‌ సీఎంగా బాధ్యతలు తీసుకున్నా.. అసలు సవాళ్లు ముందు ముందు ఎదురుకాబోతున్నాయా అనే చర్చ జనాల్లో జోరుగా వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో అసలే ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇప్పటికిప్పుడు ఈ ఇద్దరు సైలెంట్‌గా కనిపిస్తున్నారు. భవిష్యత్‌లో వీళ్లు ఎలాంటి ప్రమాదం తీసుకువస్తారు.. ఏం జరగబోతుంది అన్న టెన్షన్ అటు పార్టీ వర్గాల్లో, ఇటు జనాల్లో కనిపిస్తోంది.