REVANTH REDDY: తెలంగాణ నూతన సీఎంగా బాధ్యతలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేశారు. అనంతరం దివ్యాంగురాలు రజినికి ఉద్యోగం ఇస్తూ రేవంత్ రెండో సంతకం చేశారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. “పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో సోనియమ్మ తెలంగాణ ఏర్పాటు చేసింది. దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు.
BREAKING: REVANTH CABINET :11 మంది మంత్రులతో రేవంత్ ప్రమాణం !
ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దశాబ్ద కాలంగా తెలంగాణలో మానవ హక్కులకు భంగం కలిగింది. ఇందిరమ్మ రాజ్య ఏర్పాటుతో తెలంగాణ నలుమూలలా సమాన అభివృద్ధి జరుగుతుంది. అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది. తెలంగాణలో పదేళ్ల బాధలను ప్రజలు మౌనంగా భరించారు. ప్రత్యేక రాష్ట్రంలో అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తాం. శుక్రవారం ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. ప్రజలు ఎప్పుడైనా ప్రజాభవన్‌కు రావొచ్చు. ఈ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు. ఇవాళ ప్రగతి భవన్ చుట్టూ కంచెలు బద్దలు కొట్టాం.
అక్కడి కంచెలను ఇప్పటికే తొలగించాం. మేం పాలకులం కాదు.. మేం సేవకులం. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తాం. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా. గుండెల్లో పెట్టుకుంటా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా.. ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు” అని రేవంత్ వ్యాఖ్యానించారు.