REVANTH REDDY: కేసీఆర్ బ్యాచ్‌ను ఊడ్చేసే పనిలో రేవంత్‌.. కలుగుల్లో దాగిన వాళ్లను బయటకు తెచ్చే జీవో..

పరిపాలనా విభాగంలో తనకంటూ ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసుకుంటూనే.. కేసీఆర్‌ బ్యాచ్‌ను ఊడ్చేసే పనిలో పడ్డారు సీఎం రేవంత్. నిజంగానే అధికారం మారినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా.. ప్రభుత్వ పెద్దలు అయినా చేసేది ఇదే !

  • Written By:
  • Publish Date - January 16, 2024 / 06:50 PM IST

REVANTH REDDY: తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన మార్క్ నిర్ణయాలతో రేవంత్ దూసుకుపోతున్నారు. పరిపాలనా విభాగంలో తనకంటూ ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేసుకుంటూనే.. కేసీఆర్‌ బ్యాచ్‌ను ఊడ్చేసే పనిలో పడ్డారు. నిజంగానే అధికారం మారినప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా.. ప్రభుత్వ పెద్దలు అయినా చేసేది ఇదే ! ఇంటెలిజెన్స్ చీఫ్‌ మార్పుతో మొదలైన రేవంత్ నిర్ణయాలు.. ఆ తర్వాత భారీగానే కొనసాగుతున్నాయ్. ఆమ్రపాలి మళ్లీ స్టేట్ సర్వీసులోకి రావడం.. స్మితా సబర్వాల్‌ను ప్రాధాన్యం లేని పోస్టులోకి పంపించడం చకచకా జరిగిపోయాయ్. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌లు భారీగా బదిలీ అయ్యారు.

KTR: పెండింగ్ బిల్లులపై సర్పంచ్‌ల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా: కేటీఆర్

పాలనావర్గం అంతా.. ఇప్పుడు కొత్తకొత్తగా అనిపిస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య.. ఇప్పుడు తెలంగాణ సర్కార్‌.. ఓ కొత్త జీవో తీసుకువచ్చింది. సచివాలయంలో కానీ.. కీలక విభాగాల్లో కానీ.. కార్పొరేషన్‌లలో కానీ.. రిటైర్మెంట్‌ తర్వాత కూడా పనిచేస్తున్న వాళ్లంతా.. రిపోర్ట్ చేయాలంటూ సీఎస్‌ శాంతి కుమారి ఓ జీవో రిలీజ్ చేశారు. ఐతే ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కేసీఆర్‌ బ్యాచ్‌ను పూర్తిగా ఊడ్చి పడేసేందుకు రేవంత్ సర్కార్ ఇలాంటి జీవో తీసుకువచ్చిందనే చర్చ జరుగుతోంది. రిటైర్ అయిన ఉద్యోగులకు తెలంగాణ సచివాలయంలో ఏంటి పని..? తెలంగాణ పరిపాలనా విభాగంలో వారి పాత్ర ఎందుకు..? అంటూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ చాలాసార్లు ప్రశ్నించారు. ఐతే ఇప్పుడు అలాంటి బ్యాచ్‌ను స్వీప్‌ చేసేందుకు ఆయన సిద్ధం అయినట్లు జీవో ద్వారా క్లియర్‌గా అర్థం అవుతోంది. రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారుల లిస్ట్ భారీగానే ఉంది. రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి కోటా తిరుపతయ్య.. పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ఇంకా బాధ్యతల్లోనే ఉన్నారు.

ప్రస్తుతం ఆయన ఎంసీహెచ్‌ఆర్డీకి సలహాదారుగా పనిచేస్తున్నారు. ఇక రిటైర్డ్ ఆర్కియాలజీ డైరెక్టర్‌ శివనాగిరెడ్డి కూడా.. బుద్ధవనం ప్రాజెక్ట్‌కు సలహాదారుగా ఉన్నారు. ఇక అటు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఐఏఎస్‌ అధికారి రాణి కుముదిని సర్వీస్‌ను.. బీఆర్ఎస్‌ ప్రభుత్వం ఆ మధ్య రెండేండ్లు పొడిగించింది. వీరితో పాటు రిటైర్డ్ ఐఏఎస్‌ అరవింద్‌ సింగ్‌ సర్వీసును కూడా అప్పటి బీఆర్ఎస్‌ సర్కార్ పొడిగించింది. ఆయన ప్రస్తుతం ప్రోటోకాల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వీళ్లందరిని ఊడ్చేసే పనుల్లో సీఎం రేవంత్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. రిటైర్ అయిన తర్వాత.. సర్వీసుల పొడగింపుతో విధుల్లో ఉన్న ప్రతీ ఒక్కరిని రిపోర్ట్ చేయమని చెప్పారంటే.. కలుగుల్లో దాగి ఉన్న వాళ్లను కూడా బయటకు తీసుకువచ్చేందుకు రేవంత్‌ సర్కార్ ఇలాంటి జీవో తీసుకువచ్చిందనే చర్చ జరుగుతోంది.