REVANTH REDDY: ఆరు గ్యారెంటీలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే మహాలక్ష్మి లాంటి పథకాలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్.. ఇప్పుడు మరో రెండు హామీలు అమలు చేసేందుకు రెడీ అయ్యింది. గృహజ్యోతి పథకంలో భాగంగా 2 వందల యూనిట్ల వరకూ ఫ్రీ పవర్ స్కీంను ఫిబ్రవరి 27 లేదా 29 తేదీల్లో ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Shanmukh Jaswanth: షణ్ముక్.. నువ్ మారవా.. పిల్ల బచ్చా వేషాలు మానవా..
ఇందులో భాగంగా లబ్ధిదారులకు జీరో కరెంట్ బిల్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో పాటు 5 వందలకే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు పథకాల అమలు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చలు జరిపారు. సబ్ కేబినెట్ భేటీ కూడా నిర్వహించారు. ఈ సబ్‌కేబినెట్ భేటీలో మంత్రులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. సుదీర్ఘ చర్చల తరువాత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఫిబ్రవరి 27 లేదా 29 నుంచి ఈ రెండు పథకాలు అమలు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. అర్హుల ఎంపికకు కూడా తగిన చర్యలు తీసుకోవాలంటూ రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ముఖ్యంగా 5 వందలకే గ్యాస్ సిలిండర్ విషయంలో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. సంవత్సరానికి 8 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలా లేక 5 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలా అనే విషయంలో కీలక చర్చ జరిగినట్టు సమాచారం. ఇక ఈ స్కీమ్‌లో భాగంగా ఇచ్చే సబ్సిడీ లబ్ధిదారులకు ఇవ్వాలా లేక గ్యాస్ ఏజెన్సీలకే ఇవ్వాలా అనే విషయంలో కూడా అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్షించారు. త్వరలోనే వీటికి సంబంధించిన ప్రకటన అధికారికంగా వచ్చే అవకాశముంది.