REVANTH REDDY: ప్రజలతోనే సీఎం కాన్వాయ్.. రేవంత్‌ సంచలన నిర్ణయం..

తన కాన్వాయ్‌ కోసం నార్మల్‌ ట్రాఫిక్‌ ఆపొద్దంటూ సీఎం రేవంత్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నార్మల్‌ ట్రాఫిక్‌లోనే తన కాన్వాయ్‌ని కూడా పంపించాలని.. సిగ్నల్స్‌ వస్తే ఖచ్చితంగా ఆపాలంటూ చెప్పారు. నిజంగా ఇది ఆదర్శవంతమైన నిర్ణయం.

  • Written By:
  • Updated On - December 15, 2023 / 08:19 PM IST

REVANTH REDDY: అనుమల రేవంత్‌ రెడ్డి. ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చిన రాజకీయ నాయకుడు, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపిన రాజకీయ యోధుడు. కానీ, వీటికి మించి చాలా మందికి తెలియని మరో నిజం ఒకటుంది. అదే.. రేవంత్ చాలా సాదాసీదాగా బతికే మనిషి అని. తాను ఎంత సింపుల్‌గా ఉంటాడో చాలా సార్లు నిరూపించుకున్నారు రేవంత్‌ రెడ్డి. సీఎం అయిన తరువాత కూడా తన సింప్లిసిటీని అలాగే కంటిన్యూ చేస్తున్నారు.

PRAJAVANI TENSION: ప్రజావాణితో కొత్త టెన్షన్.. భారీ క్యూలైన్లతో జనం పరేషాన్.. పరిష్కారం ఏంటి..?

రీసెంట్‌గా యశోద హాస్పిటల్‌లో ఓ మహిళ చాలా స్వేచ్ఛగా రేవంత్‌ అన్నా అని పిలిచి తన సమస్య చెప్పుకుంది. సీఎం హోదాలో ఉండి కూడా అన్నా అన్న ఒక్క పిలుపుతో ఆగిపోయారు రేవంత్‌. ఇప్పుడు కూడా మరో విప్లవాత్మక నిర్ణయంతో తాను ఎంత డౌన్‌ టూ ఎర్త్‌ అనే విషయాన్ని ప్రూవ్‌ చేసుకున్నారు. తన కాన్వాయ్‌ కోసం నార్మల్‌ ట్రాఫిక్‌ ఆపొద్దంటూ సీఎం రేవంత్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నార్మల్‌ ట్రాఫిక్‌లోనే తన కాన్వాయ్‌ని కూడా పంపించాలని.. సిగ్నల్స్‌ వస్తే ఖచ్చితంగా ఆపాలంటూ చెప్పారు. నిజంగా ఇది ఆదర్శవంతమైన నిర్ణయం. ఇప్పటివరకూ సీఎం కాన్వాయ్‌ వస్తుంది అంటే.. ఆ రోడ్‌ మొత్తం ఖాళీగా ఉంటుంది. కాన్వాయ్‌ వచ్చేముందూ.. వెళ్లిన తరువాత మాత్రమే ఆ రోడ్‌లో మిగతా వాహనాలను అనుమతిస్తారు. కానీ సీఎం నిర్ణయంతో ఇక అలాంటి సీన్స్‌ ఎక్కడా కనిపించవు. అంతా ఎలా వెళ్తారో ఇక నుంచి సీఎం రేవంత్ కూడా అలాగే అదే ట్రాఫిక్‌లో వెళ్లబోతున్నారు.

గతంలో తమిళనాడు సీఎం స్టాలిన్‌ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్‌ కోసం సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని.. ట్రాఫిక్‌తోనే తన కాన్వాయ్‌ కూడా వెళ్లాలంటూ అధికారులను ఆదేశించారు. ఇప్పుడు సీఎం రేవంత్‌ కూడా అదే ఫాలో అవుతున్నారు. సీఎం హోదాలో ఉండి కూడా సామాన్యుడిలా బతకాలి అనుకోవడం కేవలం రేవంత్‌కు మాత్రమే సాధ్యం అంటున్నారు ఆయనను అభిమానించేవాళ్లు. ఏది ఏమైనా ఈ నిర్ణయంతో దేశంలోని సీఎంలకు ఆదర్శంగా నిలిచారు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి.