TELANGANA MOVEMENT CASES: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేత!

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో ఉద్యమాలు చేశారు. యువకులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులు.. ఇలా సకల జనులు పాల్గొనడం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంది. ఇలా పోరాడిన వేల మందిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలల్లో కేసులు నమోదు చేసింది.

  • Written By:
  • Updated On - December 8, 2023 / 08:32 PM IST

TELANGANA MOVEMENT CASES: ఇది ప్రజల ప్రభుత్వం అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజాదర్బార్‌తో జనానికి దగ్గరైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో వాళ్ళ ఆదరణ పొందుతోంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా పోరాడిన ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని డిసైడ్ అయింది. ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలు ఇవ్వాలని జిల్లా ఎస్పీలను ఆదేశించారు డీజీపీ.

FREE BUS RIDE: బస్సులు సరిపోతాయా..? కర్ణాటక పథకంతో ఆర్టీసీకి లాభమా..? ఎలా..?

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎందరో ఉద్యమాలు చేశారు. యువకులు, ఉద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థులు.. ఇలా సకల జనులు పాల్గొనడం వల్లే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సాధ్యమైంది. ఇలా పోరాడిన వేల మందిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలల్లో కేసులు నమోదు చేసింది. చాలామంది అరెస్ట్ అయ్యారు. జైళ్ళల్లో మగ్గారు కూడా. కానీ అప్పటి నుంచి ఇంకా చాలామంది ఉద్యమకారులపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో, వివిధ స్థాయిల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో 2009 నుంచి 2014 జూన్ 2 వరకూ తెలంగాణ ఉద్యమకారులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం ఒక ప్రొఫార్మను కూడా పంపించారు.

త్వరలోనే ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయనున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యమకారులు సంతోషంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమకారులపై మొత్తం 2,250 కేసులు ఉన్నాయనీ.. వాటిన్నింటినీ కేసీఆర్ ప్రభుత్వం 2018లోనే ఎత్తివేశారని బీఆర్ఎస్ లీడర్లు చెబుతున్నారు. రెండు రైల్వే కేసులను కూడా ఎత్తివేశారని అంటున్నారు.