REVANTH REDDY: ఎంపీ పదవికి రేవంత్ రాజీనామా.. స్పీకర్‌కు రాజీనామా పత్రం సమర్పణ..

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆయన మల్కాజిగిరి ఎంపీగా కొనసాగారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలుపొందారు. నిబంధనల ప్రకారం తన రాజీనామా పత్రాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు.

  • Written By:
  • Publish Date - December 8, 2023 / 06:49 PM IST

REVANTH REDDY: తెలంగాణ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. ఢిల్లీ చేరుకున్న రేవంత్.. నేరుగా స్పీకర్‌ వద్దకు వెళ్లి, రాజీనామా పత్రం అందజేశారు. అక్కడ స్పీకర్‌‌తో రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల మాజీ ఇన్‌ఛార్జ్ మణిక్యం ఠాకూర్ కూడా సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటన ముగిసిన అనంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు.

REVANTH REDDY: జాక్‌పాట్‌ కొట్టిన రజినీ.. సీఎం రేవంత్‌ మొదటి ఉద్యోగం ఇచ్చిన రజినీ జీతమెంతో తెలుసా..

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్.. కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఆయన మల్కాజిగిరి ఎంపీగా కొనసాగారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలుపొందారు. నిబంధనల ప్రకారం రెండు పదవుల్లో ఒకేసారి ఉండకూడదు కాబట్టి.. ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీలుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి కూడా ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరి రాజీనామాలతో కూడా ఆయా స్థానాలు ఖాళీ అవుతాయి. అయితే, మరికొద్ది రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. దేశవ్యాప్తంగా జరగబోయే ఎన్నికలతోపాటే వీటికీ ఎన్నికలు జరుగుతాయి.