కుటుంబ గుర్తింపు మరియు కుటుంబ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే హైడ్రా, మూసీ ప్రాజెక్టును తీసుకొస్తున్నాం అని స్పష్టం చేసారు. కిరాయి మనుషులతో మీరు చేసే హడావుడి తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. పదేళ్లు మీరు దోచుకున్న సొమ్ము మీ పార్టీ ఖాతాలో రూ.1500 కోట్లు మూలుగుతున్నాయని అందులోంచి రూ.500 కోట్లు మూసీ ప్రాంత పేదలకు పంచి పెట్టండని కోరారు.
ప్రత్యామ్నాయం ఏం చేయాలో చెప్పండి… ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉందన్నారు కేటిఆర్. హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. మూసీ మురికిలో బ్రతుకుతున్న పేదలకు ఇళ్లు ఇచ్చి, రూ.25వేలు ఇచ్చి వారి ఆత్మగౌరవాన్ని పెంచుతున్నామన్నారు. మీ ఫామ్ హౌస్ లను కాపాడుకోవడానికే పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారని కేటీఆర్ అక్రమంగా నిర్మించిన మీ ఫామ్ హౌజులు కూల్చాలా వద్దా? అని ప్రశ్నించారు. సబితమ్మ ముగ్గురు కొడుకులకు ఫామ్ హౌస్ లు ఉన్నాయి.. వాటిని కూలగొట్టాలా వద్దా..? అని నిలదీశారు.
మూసీని అడ్డు పెట్టుకుని ఎంతకాలం తప్పించుకుంటారు..? అని ప్రశ్నించారు. జవహర్ నగర్ లో 1000 ఎకరాలు ఉంది… రండి పేదలకు పంచి ఇందిరమ్మ ఇండ్లు కట్టిద్దాం అని పిలుపునిచ్చారు. ఇక్కడి ఎంపీ మోడీ దగ్గర నుంచి ఏం తీసుకొస్తారో చెప్పాలని డిమాండ్ చేసారు. సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేయొచ్చు కానీ.. మూసీని అభివృద్ధి చెయ్యొద్దా ఈటెలా? అని నిలదీశారు. కేటీఆర్, హరీష్ లు మాట్లాడిన జిరాక్స్ కాపీ తీసుకుని ఈటెల మాట్లాడుతున్నారని పార్టీ మారినా ఈటెలకు పాత వాసనలు పోలేదన్నారు. కేటీఆర్,హరీష్ రావు…కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,ఎంపి ఈటెల రాజేందర్ పై విరుచుకుపడ్డ సిఎం రేవంత్ రెడ్డి… వీపు చింత పండు చేస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. మీకు ఓటు వేయనందుకు నల్లగొండ ప్రజలను చంపేయాలని చూస్తారా? అని మండిపడ్డారు.