REVANTH REDDY: మొన్న జీవన్‌ రెడ్డి.. నిన్న మల్లారెడ్డి.. ఎవరినీ వదలని రేవంత్‌.. బీఆర్ఎస్‌లో టెన్షన్‌

అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తున్నారు సీఎం రేవంత్‌. గతంలో చాలా ఆరోపణలు ఎదుర్కొన్న వారు.. తనపై వ్యక్తిగత, రాజకీయ విమర్శలతో ఇబ్బంది పెట్టిన వారిని ఇప్పుడు ఓ ఆట ఆడుకోబోతున్నారా అనే చర్చ జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - December 14, 2023 / 04:32 PM IST

REVANTH REDDY: ప్రభుత్వం మారిందంటే.. చాలా మారతాయ్. పరిస్థితులతో సహా! తెలంగాణలో ఇప్పుడు అలాంటి సీనే ఉందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్‌.. ఎవరినీ అంత ఈజీగా వదిలి పెట్టేలా కనిపించడం లేదు అనే చర్చ జనాల్లో మొదలైంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలతో పాటు.. అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి వ్యవహారాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తున్నారు సీఎం రేవంత్‌.

Padi Kaushik Reddy: అసెంబ్లీలో కౌశిక్‌ రెడ్డి కూతురు అత్యుత్సాహం.. షాకైన సీఎం రేవంత్‌ రెడ్డి..

గతంలో చాలా ఆరోపణలు ఎదుర్కొన్న వారు.. తనపై వ్యక్తిగత, రాజకీయ విమర్శలతో ఇబ్బంది పెట్టిన వారిని ఇప్పుడు ఓ ఆట ఆడుకోబోతున్నారా అనే చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల వ్యవహారాలపై కూపీ లాగుతున్నట్లు తెలుస్తోంది. వరుసగా నమోదవుతున్న కేసులు ఇదే నిజం అని చెప్తున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ లిస్టులో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఉండడం కలకలం రేపుతోంది. కొద్దిరోజుల కింద ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లీజు వ్యవహారాలపై కేసు నమోదు అయింది. దానిపై చర్చ జరుగుతుండగానే మాజీ మంత్రి మల్లారెడ్డి అక్రమ రిజిస్ట్రేషన్, భూ కబ్జా వ్యవహారాలపైన కేసులు నమోదయ్యాయ్. ఐతే ఈ లిస్టులో ఇంకా అనేక మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల పేర్లు తెరపైకి వస్తుండడంతో.. బీఆర్ఎస్‌ నేతల్లో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది.

నిజానికి గతంలో చాలామంది ప్రజాప్రతినిధుల మీద సెటిల్‌మెంట్‌తో పాటు అవినీతి ఆరోపణలు వినిపించాయ్. ఐతే వాటిలో ఫిర్యాదుల వరకు వెళ్లిన వాటిని ఇప్పుడు సీఎం రేవంత్ బయటకు తీయబోతున్నారనే చర్చ జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లీజుకు తీసుకున్న భూములు వ్యవహారంతో మొదలైన వేట ప్రస్తుతం మాజీ మంత్రి మల్లారెడ్డి వరకు కొనసాగుతూనే ఉంది. రాబోయే రోజుల్లో మరికొంతమంది వ్యవహారాలు వెలుగులోకి వచ్చేలా కనిపిస్తున్నాయ్. దీంతో అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్న బీఆర్ఎస్‌ నేతలకు టెన్షన్ మొదలైనట్లు కనిపిస్తోంది. మొన్న జీవన్‌ రెడ్డి.. నిన్న మల్లారెడ్డి.. నెక్ట్స్ ఎవరు అనే చర్చ మొదలైంది జనాల్లో.