DHARANI: ధరణి భరతం పట్టనున్న రేవంత్.. అధికారుల్లో మొదలైన వణుకు

ధరణి పోర్టల్ పారదర్శకంగా ఉంటుందనీ.. రైతులకు మేలు చేస్తుందని అప్పటి సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. కానీ లక్షలమంది రైతులకు ఇది శాపంగా మారింది. యేళ్ళ తరబడి వారసత్వంగా వచ్చిన భూములు.. కొనుగోలు చేసి స్వాధీనంలో ఉన్న పట్టా భూములు కూడా పరాధీనం అయిపోవడంతో రైతన్నలు లబదిబోమన్నారు.

  • Written By:
  • Publish Date - December 10, 2023 / 07:51 AM IST

DHARANI: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక మొదటి రివ్యూ విద్యుత్ మీద చేశారు. అందులో లోటుపాట్లపై పరిశీలన చేశారు. ఇప్పుడు నెక్ట్స్ ధరణిని టార్గెట్ చేయబోతున్నారు. ఈ పోర్టల్ అక్రమాల పుట్టగా మారిందని అధికారంలోకి రాకముందు రేవంత్ ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక.. ధరణి స్థానంలో భూమాత తీసుకొస్తామన్నారు. అయితే ధరణిని అడ్డుపెట్టుకొని బాగుపడ్డ అక్రమార్కులతో పాటు.. ఈ వ్యవస్థకు వత్తాసు పలికిన అధికారులపైనా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం.

Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిర గర్భ గుడి ఇదే.. చూసేందుకు రెండు కళ్లు చాలవు..

ధరణి పోర్టల్ పారదర్శకంగా ఉంటుందనీ.. రైతులకు మేలు చేస్తుందని అప్పటి సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. కానీ లక్షలమంది రైతులకు ఇది శాపంగా మారింది. యేళ్ళ తరబడి వారసత్వంగా వచ్చిన భూములు.. కొనుగోలు చేసి స్వాధీనంలో ఉన్న పట్టా భూములు కూడా పరాధీనం అయిపోవడంతో రైతన్నలు లబదిబోమన్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకోగా.. మరికొందరు గుండె ఆగి చనిపోయారు. అన్నాదమ్ముల మధ్య పంచాయతీలు కూడా జరిగాయి. తమకు అన్యాయం జరిగిందని.. తహసీల్దార్ ఆఫీసులు, కలెక్టరేట్స్.. ఆఖరికి హైదరాబాద్‌లో ఉన్న CCLAకి కూడా వచ్చి మొరపెట్టుకున్నారు. అయినా ప్రభుత్వం వారి గోడు పట్టించుకోలేదు. ధరణిలో 32 మాడ్యూల్ మార్చినా చాలామందికి న్యాయం జరగలేదు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని కొందరు బీఆర్ఎస్ నేతలు, మంత్రులు భూకబ్జాలు చేసినట్టు ఆరోపణలు కూడా వచ్చాయి. రాత్రికి రాత్రే ప్రభుత్వ భూములను తమ పేరున మార్చుకున్నట్టు విమర్శలు వచ్చాయి.

Uttam Kumar Reddy: ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇప్పుడైనా గెడ్డం తీస్తారా

పోలింగ్ తేదీకి, ఫలితాలకు మధ్య ఉన్న ఒకట్రెండు రోజుల్లోనూ హైదరాబాద్ శివారుల్లో భూముల బదలాయింపు జరిగిందని రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తదితరులు CEC వికాస్ రాజ్‌కి కంప్లయింట్ కూడా ఇచ్చారు. ఇక రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ నుంచి అక్రమంగా 98 అప్లికేషన్లను క్లియర్ చేసిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ధరణి పోర్టల్ పుట్టుక నుంచి జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతి భాగోతంపై రేవంత్ రెడ్డి విచారణ జరిపించే ఆలోచనలో ఉన్నారు. ఈ స్కామ్‌లో కొందరు IAS అధికారుల ప్రమేయం ఉందని తెలుస్తోంది. వారిపై చర్యలకు వెనుకాడేది లేదని సమాచారం. ప్రధానంగా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోనే ధరణి దందా నడిచినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ధరణి స్థానంలో ఎలాంటి అక్రమాలు జరక్కుండా భూ మాత వ్యవస్థను తీసుకొస్తామని.. ఎన్నికల ప్రచారంలో జనానికి హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ వ్యవస్థ తెచ్చేముందు సమగ్ర అధ్యయనం చేయాలని ఆయన భావిస్తున్నారు.

ధరణికి ప్రత్యామ్నాయంగా భూమాతను తీసుకురావడం కన్నా.. ప్రజలకు న్యాయం జరిగేలా, మేలు జరిగేలా వ్యవస్థ ఉండాలన్నది సీఎం రేవంత్ ఆలోచనగా కనిపిస్తోంది. భూ సమస్యలపై అధ్యయనానికి కమిటీ వేస్తారా..? లేదా..? అన్నది వచ్చే వారంలో తెలిసే అవకాశాలు ఉన్నాయి. వచ్చేవారంలో ధరణిపై సమీక్షా సమావేశం పెట్టడానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేసినట్టు సమాచారం.