REVANTH REDDY VS KCR: దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ అన్యాయం అసెంబ్లీలో ఎదురుదాడికి కాంగ్రెస్ ప్లాన్

కృష్ణా నదీ జలాల వివాదం, యాజమాన్యం హక్కులు కేంద్రానికి అప్పగించడంపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేయాలని మాజీ సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ ఎటాక్‌కి కౌంటర్ ఎటాక్స్ రెడీ చేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.

  • Written By:
  • Publish Date - February 6, 2024 / 04:54 PM IST

REVANTH REDDY VS KCR: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈసారి ధూమ్‌ధామ్‌గా జరగబోతున్నాయి. మాజీ సీఎం కేసీఆర్ కూడా ఈ అసెంబ్లీ సమావేశాలకు వచ్చే అవకాశం ఉండటంతో కృష్ణా జలాల ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడంపై చర్చ, కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలు.. తదితర అంశాలపై హాట్ హాట్ డిస్కషన్స్ జరగబోతున్నాయి. అయితే బీఆర్ఎస్‌ను ఎదురుదెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ ఇప్పుడు కొత్త వివాదం తెరమీదకు తీసుకొస్తోంది. దాంతో గులాబీ నేతలు ఏమీ సమాధానం చెప్పుకోలేక ఇరుకున పడతారని భావిస్తోంది.

TS EAPCET: తెలంగాణలో ఈఏపీసెట్ షెడ్యూల్ విడుదల

కృష్ణా నదీ జలాల వివాదం, యాజమాన్యం హక్కులు కేంద్రానికి అప్పగించడంపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేయాలని మాజీ సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఈనెల 8 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై మాట్లాడాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్ ఓటమి తర్వాత మొదటిసారి తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్.. కృష్ణా నది పరివాహక ప్రాంతాల ఎమ్మెల్యేలు, లీడర్లతో సమావేశం అయ్యారు. అసెంబ్లీలో పోరాటం, నల్లగొండలో బహిరంగ సభ నిర్వహణ అంశాలపై BRS నేతలతో మాట్లాడారు కేసీఆర్. కృష్ణా జలాలపై బీఆర్ఎస్ ఎటాక్‌కి కౌంటర్ ఎటాక్స్ రెడీ చేసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో దక్షిణ తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగిందన్న అంశాన్ని లేవనెత్తాలని ప్లాన్ చేస్తున్నారు. మహబూబ్ నగర్‌లో నిర్మించాల్సిన SLBC, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడో పూర్తికావాలి. దక్షిణ తెలంగాణ కరువు తీరుస్తుందని భావించిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా ముందుకు సాగలేదు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగ మార్గం కూడా మధ్యలోనే ఆగింది.

రాష్ట్రం ఏర్పడక ముందు ఈ సొరంగం పనులు 30 కిలోమీటర్లు పూర్తయ్యాయి. ఇంకా పది కిలోమీటర్లు మాత్రమే పెండింగ్‌లో ఉంటే.. బీఆర్ఎస్ వచ్చాక కిలోమీటర్ మాత్రమే పూర్తి చేసింది. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల్లో కమీషన్లు ఎక్కువగా ఉండవన్న ఉద్దేశ్యంతోనే వీటిని నిర్లక్ష్యం చేశారనీ.. అవసరం లేకపోయినా కాళేశ్వరం కట్టి కమీషన్లు దండుకున్నారని కాంగ్రెస్ ఎటాక్ చేయబోతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే దక్షిణ తెలంగాణకు అన్యాయం జరిగిందని ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ టార్గెట్ చేయబోతోంది. ఉమ్మడి ఏపీలో అల్లాడిన పాలమూరు జిల్లాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించబోతోంది.