REVANTH Vs KTR: అసెంబ్లీ సమావేశాలు.. సభలో ఎవరిది పైచేయి..?

కేటీఆర్‌ ప్రతిపక్షంలో ఉన్నారు. దీంతో ఆయన ప్రభుత్వం ఎలాంటి విమర్శలు చేస్తుంది..? అధికార పక్షం విసిరే సవాళ్లకు ఎలాంటి సమధానం చెప్తారు అనేది అందరిలో ఇంట్రెస్ట్‌ని నింపింది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక పక్క రేవంత్‌ రెడ్డి, మరోపక్క కేటీఆర్‌.

  • Written By:
  • Publish Date - December 16, 2023 / 07:09 PM IST

REVANTH Vs KTR: తెలంగాణ పాలిటిక్స్‌ ఫాలో అయ్యేవాళ్లంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి అసెంబ్లీ సెషన్‌ జరిగింది. పదేళ్లుగా ట్రెజరీ బెంచ్‌లో కూర్చున్న కేటీఆర్‌ ఇప్పుడు ఆపోజిషన్‌లో ఉన్నారు. అధికార పక్షంలో ఉన్నప్పుడు కేటీఆర్‌ స్పీచ్‌ అసెంబ్లీలో ఎలా ఉండేదో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఆ ప్లేస్‌లో రేవంత్‌ టీం ఉన్నారు. కేటీఆర్‌ ప్రతిపక్షంలో ఉన్నారు. దీంతో ఆయన ప్రభుత్వం ఎలాంటి విమర్శలు చేస్తుంది..?

Nagababu : రెండు ఓట్ల వివాదంలో నాగబాబు.. దొంగ ఓట్లంటూ వైసీపీ విమర్శలు..

అధికార పక్షం విసిరే సవాళ్లకు ఎలాంటి సమధానం చెప్తారు అనేది అందరిలో ఇంట్రెస్ట్‌ని నింపింది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక పక్క రేవంత్‌ రెడ్డి, మరోపక్క కేటీఆర్‌. వీళ్లిద్దరి మధ్య మాటల యుద్ధం చూసేందుకు చాలా మంది వెయిట్‌ చేశారు. అందరి వెయిటింగ్‌కు తగ్గట్టుగానే మొదటి రోజే ఆరోపణలు, విమర్శలతో అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రతిపక్షంలో ఉన్నా.. కేటీఆర్ తగ్గేదేలే అన్నట్టుగా స్పీచ్‌ ఇచ్చారు. తమ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని సభకు వివరించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను సమర్ధవంతంగా తిప్పకొట్టారు. ప్రతిపక్షంలో ఉండి కూడా ఏకంగా గంటకు పైగా స్పీచ్‌ ఇచ్చారు. దీంతో అధికార పార్టీ నేతలు నివ్వెరబోయారు. దాదాపు మధ్యాహ్నం వరకూ ఇదే సీన్‌ కనిపించింది. కానీ మధ్యాహ్నం సభ ప్రారంభమైన తరువాత సీఎం రేవంత్‌ మాట్లాడటం మొదలు పెట్టారు. దీంతో వార్‌ వన్‌ సైడ్‌ అయ్యింది.

బీఆర్ఎస్‌ ప్రభుత్వంలో తరిగిన తప్పులను.. ప్రతిపక్షాలను బీఆర్ఎస్‌ ప్రభుత్వం అణచివేసిన తీరును ఎండగట్టారు సీఎం రేవంత్‌. బీఆర్ఎస్‌ పాలనలో ఉద్యమకారుల జీవితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని లేవనెత్తుతూ బీఆర్ఎస్‌ పార్టీ మీద మాటల యుద్ధం చేశారు. సింపుల్‌గా చెప్పాలంటే పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి తాను గమనించిన అన్ని విషయాలను సింగిల్‌ స్పీచ్‌లో చెప్పేశారు రేవంత్‌. దీంతో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు కామ్‌ అయ్యారు. ఫస్ట్‌ హాఫ్‌ ఒకరు సెకండ్‌ హాఫ్‌ ఒకరు అన్నట్టుగా.. కేటీఆర్‌, రేవంత్‌ సభలో రఫ్పాడించారు. విమర్శలు ఆరోపణల నేపథ్యంలో మొదటి రోజు సభ వాయిదా పడింది. ఇలా మొదటి రోజే గతంలో ఎప్పుడూ లేనంగా వాడివేడిగా జరిగింది తెలంగాణ అసెంబ్లీ సెషన్‌.

https://youtu.be/G7Q24tYeWWU