ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే తాట తీస్తా: రేవంత్ వార్నింగ్

కొత్త కొత్త పందాల లో నేరాలు జరుగుతున్నాయన్నారు సిఎం రేవంత్. అన్ని రకాల నెరగాలను అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని స్పష్టం చేసారు. నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు ఆయన.

  • Written By:
  • Publish Date - October 21, 2024 / 11:19 AM IST

కొత్త కొత్త పందాల లో నేరాలు జరుగుతున్నాయన్నారు సిఎం రేవంత్. అన్ని రకాల నెరగాలను అడ్డుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని స్పష్టం చేసారు. నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు ఆయన. చదువుకున్నవారు సైబర్ క్రైమ్ బాధితులుగా మారుతున్నారని తెలిపారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్ మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తున్నాయన్నారు సిఎం. పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ విషయంలో విపత్కర పరిస్థితి ఎదురుకుంటుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో డ్రగ్స్ విరివిగా రవాణా పెరిగిపోయిందని… యువకులను మత్తు వైపు నడిపిస్తున్నాయి ముఠాలు అని ఆవేదన వ్యక్తం చేసారు. డ్రగ్స్ అరికట్టేందుకు టీజీ న్యభ్ ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశామూ డీజీ స్థాయి అధికారిని నియముంచామని అన్నారు. ట్రాఫిక్ నియంత్రంతో పాటు ట్రాఫిక్ ఉల్లంఘించే వారిని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసారు. మతోన్మాద శక్తులపై ఉక్కు పాదం మోపుతామన్నారు. కొంతమంది హైదరాబాదులో శాంతి లేకుండా అలజడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ముత్యాలమ్మ దేవాలయంలో జరిగిన సంఘటనలో నేరగాలను కఠినంగా శిక్షిస్తామన్నారు. కొంతమంది వ్యక్తులు కావాలనే సమాజంలో అలజడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.