KALPANA SOREN: ఆమె సీఎం ఎందుకు కాలేదంటే! అడ్డం పడిన తోటి కోడలు

మరికొన్ని గంటల్లో సీఎం పదవికి కల్పనా సొరెన్‌ను ఎంపిక చేస్తారన్న టైమ్‌లో ఊహించని షాక్ తగిలింది. సంకీర్ణ కూటమిలోని ఎమ్మెల్యేలంతా ఒప్పుకున్నా.. సొరెన్ కుటుంబంలోనే అభ్యంతరం వ్యక్తమైంది. హేమంత్ భార్య కల్పనకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు.

  • Written By:
  • Updated On - February 1, 2024 / 02:50 PM IST

KALPANA SOREN: ఆమెకు ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పదవి అందినట్టే అంది చేజారిపోయింది. ఆమె ఎవరో కాదు.. సీఎం పదవికి రాజీనామా చేసిన హేమంత్ సొరెన్ భార్య కల్పనా సొరెన్. భూముల కుంభకోణం, మనీ ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న హేమంత్ సొరెన్.. ఈడీ అరెస్ట్‌కు ముందు ఝార్ఖండ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో భార్య కల్పనా సొరెన్ ముఖ్యమంత్రి అవుతారని పార్టీ శ్రేణులు చెప్పుకున్నాయి. ఈ వ్యవహారం నడుస్తున్నప్పుడే JMM సంకీర్ణ భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలు పెట్టే బేడా సర్దుకొని రాంచీకి వచ్చారు కూడా.

Pawan Kalyan: యాత్ర2కు పోటీగా రాంబాబు.. ఏపీలో పోటా పోటీగా సినిమాలు

మరికొన్ని గంటల్లో సీఎం పదవికి కల్పనా సొరెన్‌ను ఎంపిక చేస్తారన్న టైమ్‌లో ఊహించని షాక్ తగిలింది. సంకీర్ణ కూటమిలోని ఎమ్మెల్యేలంతా ఒప్పుకున్నా.. సొరెన్ కుటుంబంలోనే అభ్యంతరం వ్యక్తమైంది. హేమంత్ భార్య కల్పనకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. పార్టీలోనూ ఆమెకు ఎలాంటి పదవి లేదు. అయితే రాజకీయాల్లో హేమంత్‌కు ముఖ్యవిషయాల్లో సలహాలు ఇస్తారని చెబుతారు. కల్పన ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్. ఎంబీఏ కూడా చేసింది. ఓ స్కూల్ నడుపుతోంది. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. ఆమెకు ముఖ్యమంత్రి పీఠం ఇవ్వడానికి.. JMM వ్యవస్థాపక అధ్యక్షుడు శిబూసొరెన్ పెద్ద కోడలు అడ్డుపడినట్టు తెలిసింది. JMM శాసనసభా పక్ష సమావేశం బుధవారం మధ్యాహ్నం జరిగినప్పుడు.. ఆ మీటింగ్‌లో కల్పనా సొరెన్ కూడా పాల్గొన్నారు. కానీ హేమంత్ వదిన సీతాసొరెన్.. సీఎం పదవి కల్పనకు ఇవ్వాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించారు.

కొందరు JMM ఎమ్మెల్యేలు కూడా ఆమెకు సపోర్ట్ ఇచ్చారు. పార్టీలో ఎవరో ఒక సీనియర్ నేతకు ఇవ్వండి.. లేదంటే ఎన్నో యేళ్ళుగా ఎమ్మెల్యేగా గెలుస్తూ.. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న తనకు గానీ ఇవ్వాలని సీతా సొరెన్ డిమాండ్ చేశారు. సొంత కుటుంబంలోనే విభేదాలు రావడంతో.. అది రాజకీయ సంక్షోభానికి దారి తీస్తుందని హేమంత్ భయపడ్డారు. చేసేది లేక.. పార్టీలో సీనియర్ లీడర్, రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్న చంపయీ సొరెన్‌ను సీఎం చేయాలని నిర్ణయించారు. దాంతో JMM ఎమ్మెల్యేలు ఆయన్నే శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. కానీ ముఖ్యమంత్రి పదవి చేతికి వచ్చినట్టే వచ్చి.. తోటి కోడలు అభ్యంతరంతో ఆగిపోవడంతో కల్పనా సొరెన్ తీవ్ర నిరాశ చెందినట్టు తెలుస్తోంది. పాలిటిక్స్‌లో ప్రత్యర్థి పార్టీల కన్నా ఇంటి పోరు చాలా డేంజర్ అని మరోసారి రుజువైంది.