ROJA DEFEAT : రోజాకి తెలిసిపోయిందా ! నగరిలో ఓటమి గ్యారంటీయేనా ?

ఏపీలో నగరి (Nagari) నియోజకవర్గంలో వైసీపీ (YCP) అభ్యర్థిగా ఉన్న మంత్రి రోజాకి ఈసారి ఓటమి తప్పదని అర్థమైంది. ఓటు వేసిన సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది.

 

 

 

ఏపీలో నగరి (Nagari) నియోజకవర్గంలో వైసీపీ (YCP) అభ్యర్థిగా ఉన్న మంత్రి రోజాకి ఈసారి ఓటమి తప్పదని అర్థమైంది. ఓటు వేసిన సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. నగరిలో తన ఓటమి కోసం వైసీపీలోనే కొందరు నేతలు పనిచేస్తున్నారంటూ రోజా కామెంట్ చేశారు. మొన్న మొన్నటిదాకా గెలుపుపై ధీమా వ్యక్తం చేసిన ఆమె.. మళ్ళీ మంత్రి అవుతానని కామెంట్స్ కూడా చేశారు. కానీ పోలింగ్ డే నాడు… సడన్ గా ఇలా ప్లేట్ మార్చడంపై సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.

రోజాకి (Roja) నగరి టిక్కెట్ ఇవ్వొద్దని వైసీపీ అధిష్టానాన్ని కోరినా వినకుండా ఇవ్వడమే ఇప్పుడా సీటు ఓటమికి కారణంగా కనిపిస్తోంది. నిజానికి రోజా గతంలో రెండు సార్లు కూడా స్వల్ప మెజార్టీతోనే గట్టెక్కారు. రెండోసారి గెలిచాక.. సొంత పార్టీ నేతలను చులకన చేయడం, ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో వైసీపీలో ఆమె వ్యతిరేక వర్గం పెరిగిపోయింది. కొందరు పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ (TDP) లో జాయిన్ అయ్యారు కూడా. అందుకే బయటకు వెళ్ళినవారితో పాటు… పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కూడా రోజాని ఓడించాలని డిసైడ్ అయ్యారు. వీళ్ళందరికీ మంత్రి పెద్దిరెడ్డి అండ ఉందన్న టాక్ నడుస్తోంది.

ఈ ఎన్నికల్లో జగన్ నుంచి నామినేషన్ పదవులు తీసుకున్న వారు కూడా తనను ఓడించడానికి ట్రై చేస్తున్నారని రోజా కామెంట్ చేశారు. టీడీపీ నేతల కంటే వైసీపీ నేతలే ఆమె ఓడిపోవాలని కోరుకుంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఓడిపోయే మొదటి సీటు నగరియే అన్న టాక్ కూడా నడుస్తోంది. ఆ విషయం రోజాకు కూడా తెలుసు కాబట్టే… ఆమె అలా కామెంట్స్ చేసినట్టు చెబుతున్నారు. సో… నగరిలో హ్యాట్రిక్ కొట్టి మంత్రి అవుదామనుకున్న రోజా ఆశలు అడియాసలేనా ?