G20 summit: ఇండియాకు పుతిన్ రావట్లేదు.. బైడెన్ వస్తున్నాడు.. ఫ్రెండ్‌షిఫ్‌ ఫసక్కేనా..?

నిజానికి రష్యా–ఇండియా స్నేహమైనా.. అమెరికా–ఇండియా ఫ్రెండ్‌షిపైనా అవసరాలతో కూడుకున్నవే. ఇందులో ఏ డౌటూ లేదు. కానీ ఇటివలి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మోదీ–పుతిన్‌ మధ్య బంధం మునుపటిలా లేదనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - August 25, 2023 / 10:20 PM IST

G20 summit: వచ్చె నెల ఢిల్లీలో జరగనున్న జీ20 లీడర్స్ సమ్మిట్‌కు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరయ్యే ఆలోచనలో లేరని క్రెమ్లిన్ స్పష్టం చేసింది. ఇండియాకు రష్యానే ట్రెడిషనల్‌ ఫ్రెండ్‌. అమెరికా అవసరానికి వాడుకునే ఫ్రెండ్‌. అంటే నటించే ఫ్రెండ్‌. మిలటరీ సాయం నుంచి పెట్రోల్‌ వరకు రష్యా.. ఇండియాను ఎన్నోసార్లు ఆదుకుంది. అయితే 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండియా అమెరికాకూ దగ్గరైంది. ఇందులో తప్పుపట్టానికి ఏమీ లేదు. పరస్పర ప్రయోజనాల కోసం ఏ దేశంతోనైనా స్నేహం చేయవచ్చు. నిజానికి రష్యా–ఇండియా స్నేహమైనా.. అమెరికా–ఇండియా ఫ్రెండ్‌షిపైనా అవసరాలతో కూడుకున్నవే. ఇందులో ఏ డౌటూ లేదు. కానీ ఇటివలి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మోదీ–పుతిన్‌ మధ్య బంధం మునుపటిలా లేదనిపిస్తోంది.

వచ్చే నెలలో ఢిల్లీలో జరగనున్న జీ20 లీడర్స్‌ సమ్మిట్‌కి పుతిన్‌ హాజరవడంలేదు. ఇది ఇండియా తొలిసారి నిర్వహిస్తోన్న సమ్మిట్‌. మనకు ఈ అవకాశం దక్కడం ఇండియా సాధించిన విజయం కూడా. అంతటి ప్రతిష్టాత్మక సమ్మిట్‌కి మన మిత్రదేశం అధ్యక్షుడు డుమ్మా కొడుతుండడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బయటకు వ్యక్తిగత కారణాలే చెబుతున్నప్పటికీ పుతిన్‌ మనసులో ఏముందన్నదానిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అమెరికాకు మోదీ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని.. అందుకే పుతిన్‌ అలిగారన్న మాటలు వినిపిస్తున్నాయి. దీన్ని మనసులో పెట్టుకునే జీ20 సమ్మిట్‌కి భౌతికంగా హాజరవకుండా మొక్కుబడిగా(వర్చువల్‌) అటెండ్‌ అవ్వాలనే ఆలోచనలో క్రెమ్లిన్‌ ఉన్నట్టు సమాచారం.
ఇక జాబిల్లి దక్షిణ ధృవంపై చంద్రయాన్‌-–3 ల్యాండ్‌ అవ్వడాన్ని అంతర్జాతీయంగా అన్ని ప్రధాన ఛానెల్స్‌ కవర్‌ చేసినా.. రష్యా మాత్రం చూసీచూడనట్టు వ్యవహరించింది. నిజానికి చంద్రయాన్‌-–3 ల్యాండింగ్‌ సక్సెస్‌ తర్వాత అమెరికా నుంచి పాకిస్థాన్‌ వరకు ప్రధాన వెబ్‌సైట్లలో బ్యానెర్ ఐటెమ్‌గా ఇస్రో వార్తనే కనిపించింది. అటు రష్యా వెబ్‌సైట్లలో కానీ, ఛానెల్స్‌లో కానీ కవరేజీ లేదు. ల్యాండింగ్‌ జరిగిన చాలా సేపటికి ఓ సాధారణ వార్తలాగా పబ్లిష్ చేశారు. మనకంటే ఒక్కరోజు ముందుగా జాబిల్లిపై కాలు మోపాలని చూసిన రష్యా లూనా-25 ఫెయిల్ అవ్వడమే దీనికి కారణంగా తెలుస్తోంది. మరోవైపు పుతిన్‌ రాకపోవడానకి వేరే కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు. యుక్రెయిన్‌లో యుద్ధ నేరాలకు పాల్పడినట్లు ఆరోపిస్తూ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఆయనపై ఇప్పటికే అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ వారం ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు పుతిన్ భౌతికంగా హాజరుకాలేదు కూడా.