బాలినేని బాటలో సామినేని..

వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. అధికారం కోల్పోవడం.. కనీసం ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో.. కోలుకోలేని దెబ్బపడినట్లు అయింది. అందులోంచి బయటకు రాకముందే.. నేతలు ఒక్కొక్కరుగా జంప్ జిలానీ అంటూ.. గోడ దూసుకేస్తుండడం.. వైసీపీని టెన్షన్ పెడుతోంది.

  • Written By:
  • Publish Date - September 19, 2024 / 02:17 PM IST

వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. అధికారం కోల్పోవడం.. కనీసం ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో.. కోలుకోలేని దెబ్బపడినట్లు అయింది. అందులోంచి బయటకు రాకముందే.. నేతలు ఒక్కొక్కరుగా జంప్ జిలానీ అంటూ.. గోడ దూసుకేస్తుండడం.. వైసీపీని టెన్షన్ పెడుతోంది. సన్నిహితులు, బంధువులు అనుకున్న వాళ్లు కూడా హ్యాండ్ ఇస్తుండడం.. జగన్‌కు నిద్ర లేకుండా చేస్తోంది. ఐదేళ్ల పాటు అధికారం అనుభవించిన నేతలతో పాటు దశాబ్దకాలంగా జగన్‌కు అండగా నిలిచిన సన్నిహితులు కూడా.. ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ వైసీపీకీ, ఆ పార్టీ ఇచ్చిన రాజ్యసభ ఎంపీ పదవికి కూడా గుడ్ బై చెప్పేశారు. జగన్‌కు బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడారు. జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే నాగబాబుతో చర్చలు పూర్తయ్యాయ్‌. పవన్‌తో భేటీ తర్వాత చేరిక లాంఛనంగా మారింది. ఐతే ఇప్పుడు బాలినేని బాటలోనే.. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే, జగన్ కు సన్నిహితుడిగా పేరున్న సామినేని ఉదయ భాను కూడా వైసీపీని వీడేందుకు సిద్దమవుతున్నారు.

ఆయన కూడా జనసేనలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే జనసేన నేతలతో టచ్ లోకి వెళ్లి సంప్రదింపులు జరుపుతున్న సామినేని ఉదయబాను.. వైసీపీ నేతలకు మాత్రం అందుబాటులో లేకుండా పోయారు. దీంతో జనసేనలో ఆయన చేరిక దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన జనసేనలో చేరబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఆదివారం పవన్‌ను కలిసేందుకు ఉదయభాను ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయన పార్టీలో చేరితే ఎమ్మెల్సీ పదవి కేటాయించేందుకు జనసేన హామీ ఇచ్చిందని తెలుస్తోంది. జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి మూడుసార్లు విజయం సాధించారు సామినేని. జగన్ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా ఆశించి భంగపడ్డారు. ఐతే మొన్నటి ఎన్నికల్లో జగ్గయ్యపేట నుంచి పోటీ చేసిన సామినేని ఉదయభాను.. టీడీపీ అభ్యర్తి చేతిలో ఓడిపోయారు. ఇక ఇప్పుడు వైసీపీతో.. బంధం తెంచుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు.