Barrelakka: చెల్లీ భయపడకు.. నేనొస్తున్నా.. బర్రెలక్కకు మద్దతుగా సర్పంచ్‌ నవ్య..

బర్రెలక్కకు మద్దతుగా స్టేషన్ ఘన్‌పూర్ స్వతంత్ర అభ్యర్థి, జానకీపురం సర్పంచ్ నవ్య మద్దతుగా నిలిచారు. ఆమె తరఫున ప్రచారం చేయడానికి జనగాం జిల్లా నుంచి నాగర్ కర్నూల్ జిల్లాకు వెళ్లారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యపై వేధింపుల ఆరోపణలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యారు.

  • Written By:
  • Publish Date - November 23, 2023 / 06:09 PM IST

Barrelakka: కొల్లాపూర్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క అలియాస్‌ కర్నె శిరీషకు రోజు రోజుకూ మద్దతు పెరుగుతోంది. రీసెంట్‌గా శిరీష ప్రచారం చేస్తుండగా ఆమె తమ్ముడిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. దీంతో శిరీషకు సపోర్ట్‌గా రాజకీయ ప్రముఖులతోపాటు నిరుద్యోగులు, ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు వస్తున్నారు. ఆమె తరఫున కొల్లాపూర్‌లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ ఊపుని చూసి నాగర్ కర్నూల్ జిల్లా రాజకీయాల్లో అలజడి మొదలైంది.

Barrelakka: బడా లీడర్లకు బర్రెలక్క టెన్షన్‌.. ఎన్నికల్లో ఆమె ప్రభావం ఎంత..?

అటు అభ్యర్థులు సైతం కాస్త కలవరపాటుకు గురవుతున్నారు. ఇప్పుడు బర్రెలక్కకు మద్దతుగా స్టేషన్ ఘన్‌పూర్ స్వతంత్ర అభ్యర్థి, జానకీపురం సర్పంచ్ నవ్య మద్దతుగా నిలిచారు. ఆమె తరఫున ప్రచారం చేయడానికి జనగాం జిల్లా నుంచి నాగర్ కర్నూల్ జిల్లాకు వెళ్లారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యపై వేధింపుల ఆరోపణలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యారు సర్పంచ్ నవ్య. తాజాగా ఆమె స్టేషన్ ఘన్‌పూర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె తన నియోజకవర్గంలో ప్రచారం చేస్తూనే మరోవైపు బర్రెలక్కకు మద్దతు తెలుపుతూ ఆమె కోసం ప్రచారం చేశారు. గురువారం ఉదయం జానకీపురం నుంచి కొల్లాపూర్ వెళ్లి ప్రచారం నిర్వహించారు నవ్య. నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు ముందుకు వచ్చిన బర్రెలక్కకు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు.

అందుకే ఆమె తరఫున ప్రచారం చేస్తున్నానన్నారు. బర్రెలక్కకు కేవలం నిరుద్యోగులు, యువత మాత్రమే కాదని.. అభివృద్ధిని కోరుకునేవాళ్లు, ఉద్యోగులు, మేధావులు, ప్రజలు కూడా సపోర్ట్ చేసి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. బర్రెలక్కను ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఓటర్లను అభ్యర్థించారు. మరో వారం రోజుల్లో తెలంగాణలో పోలింగ్‌ జరగబోతోంది. మరి బర్రెలక్కను కొల్లాపూర్‌ ప్రజలు అసెంబ్లీకి పంపుతారా.. ఇంటికి పంపుతారా చూడాలి.