YS JAGAN: జగన్ బెయిల్ రద్దుపై పిటిషన్.. శుక్రవారం విచారించనున్న ధర్మాసనం

జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ కేసును విచారించబోతుంది. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా జగన్ బెయిల్‌పై ఉన్నాడు. అయితే, జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ గతంలోనే ఎంపీ రఘురామ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 04:22 PM IST

YS JAGAN: అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటూ, బెయిల్‌పై ఉన్న ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ రఘురామ కృష్ణం రాజు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. వచ్చే శుక్రవారం ఈ కేసు విచారణ జరగనుంది. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ కేసును విచారించబోతుంది. అక్రమాస్తుల కేసులో గత పదేళ్లుగా జగన్ బెయిల్‌పై ఉన్నాడు.

REVANTH REDDY: శ్రీరాం సాగర్ చూపించి ఓట్లడుగుతాం.. కాళేశ్వరం చూపించి ఓట్లడుగుతావా.. కేసీఆర్‌కు రేవంత్ సవాల్..

అయితే, జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ గతంలోనే ఎంపీ రఘురామ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్‌పై నమోదైన కేసుల విచారణ సాగడం లేదని, త్వరగా విచారించేలా చూడాలని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ దాఖలు తరువాతే ఎంపీ రఘురామను ఏపీ సీఐడీ అరెస్ట్ చేసి, కస్టోడియల్ టార్చర్ చేసింది. మరోవైపు జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ సరిగ్గా స్పందించడం లేదని ఆరోపణలున్నాయి. ఈ అంశంపై సీబీఐకి నోటీసులు కూడా జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. దీనికి సీబీఐ ఇచ్చిన సమాధానంతో జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. రఘురామ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.