తిరుమల ఆలయంలో శాంతి హోమం నిర్వహించారు అర్చకులు. ముందుగా శాంతి హోమం, తర్వాత వాసు హోమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు, జీయర్ స్వాముల పర్యవేక్షణలో శాంతి హోమం, వాస్తు హోమం నిర్వహించారు. శ్రీవారిపోటు లో ప్రోక్షణ నిర్వహించారు. నెయ్యి వాడకం జరిగిన అన్ని చోట్ల సంప్రోక్షణ కొనసాగుతోంది. అన్న ప్రసాదాల పోటు, బూంది పోటు, లడ్డు పోటు లో ప్రోక్షణ నిర్వహించారు.
పంచ గవ్యాలతో ఆలయం లోని ఉగ్రాణం లోనూ వాస్తు శుద్ధి నిర్వహించారు. సంప్రోక్షణ తో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు పోటులో అన్న ప్రసాదాల తయారీ నిలిపివేసారు. ప్రత్యేక గంట తర్వాత శ్రీవారికి అన్న ప్రసాదాలు తయారీ పోటు సిబ్బంది ప్రారంభించారు. శాంతిహోమం తర్వాత అవాహన చేసుకుని ఆ దినుసులను స్వామి వారి దగ్గర పెట్టి కుంభ ప్రోక్షణ నిర్వహించనున్నారు.