జగన్ కు షర్మిల 4 కండీషన్లు, అసలు ఏంటి అవి…?

తాను వదిలిన బాణం తనకే తిరిగి గుచ్చుకోవడం వైసీపీ అధినేత జగన్ కు దిమ్మ తిరిగిపోయేలా చేస్తోంది. తెలంగాణాకు పరిమితం అనుకున్న చెల్లెలు పీసీసి చీఫ్ గా ఏపీలో అడుగుపెట్టడం వైఎస్ జగన్ గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది.

  • Written By:
  • Publish Date - October 22, 2024 / 05:54 PM IST

తాను వదిలిన బాణం తనకే తిరిగి గుచ్చుకోవడం వైసీపీ అధినేత జగన్ కు దిమ్మ తిరిగిపోయేలా చేస్తోంది. తెలంగాణాకు పరిమితం అనుకున్న చెల్లెలు పీసీసి చీఫ్ గా ఏపీలో అడుగుపెట్టడం వైఎస్ జగన్ గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది. షర్మిలను తక్కువ అంచనా వేసి… నానా కూతలు కూయించిన వైసీపీ నేతలకు, ఆమె పవర్ ఏంటో కడప జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో చూపించింది. కడప ఎంపీ సీటు విషయంలో వైసీపీ చచ్చి చెడి గెలిచింది. కడప ఎమ్మెల్యే సీటు, కమలాపురం ఎమ్మెల్యే సీటు వైసీపీ కోల్పోవడం వెనుక శర్మిలే కారణం.

ఇక కాంగ్రెస్ కు కూడా దగ్గర కానీయకపోవడం జగన్ కు అసలు మింగుడు పడటం లేదు. ఢిల్లీలో జగన్ కు సపోర్ట్ అవసరం… కాని షర్మిలతో గొడవ పెట్టుకుంటే అది జరిగేలా కనపడటం లేదు. సరిహద్దు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత ప్రభుత్వాలే. ఏపీలో అత్యంత దారుణమైన స్థితిలో వైసీపీ ఉంది. పార్టీని బలోపేతం చేయడం కంటే… పార్టీని కాపాడుకోవడం జగన్ కు కీలకం. అందుకే నాయకులకు పదవుల పంపకాలు పెద్ద ఎత్తున చేస్తూ సొంత సామాజిక వర్గానికి పెద్ద ఎత్తున పదవులు కట్టబెట్టి వారి భుజాలపై బాధ్యత పెడుతున్నారు.

ఇదే సమయంలో బెంగళూరు ప్యాలెస్ వేదికగా షర్మిలతో రాజీ బేరాలు కుదిర్చే కార్యక్రమం మొదలుపెట్టారు. ముందు నుంచి జగన్ విషయంలో ఒక్క అడుగు కూడా వెనక్కు వేయని షర్మిల అన్న ముందు 4 కండీషన్లు పెట్టారు. అసలు ఏంటీ ఈ 4 కండీషన్లు అనేది ఒక్కసారి చూస్తే…

కడప ఎంపీ సీటు

కాంగ్రెస్ తో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉన్నా లేకపోయినా కడప ఎంపీ అభ్యర్ధిగా అవినాష్ రెడ్డి పోటీ చేయకూడదు. ఆ సీటు ఖచ్చితంగా వైఎస్ విజయమ్మ లేదా, ఆమె తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డికి సీటు కేటాయించాల్సి ఉంటుంది. ఒకవేళ పొత్తు ఉంటే… వైఎస్ సునీత లేదంటే ఆమె భర్తకు ఆ సీటు కేటాయించాల్సి ఉంటుంది. కడప పార్లమెంట్ పరిధిలో వైఎస్ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయకూడదు. అయితే ఇక్కడ జగన్ వర్గం… కమలాపురం ఎమ్మెల్యే స్థానం వైఎస్ సునీతకు కేటాయించి, కడప ఎంపీ స్థానాన్ని అవినాష్ రెడ్డినే కొనసాగిస్తామని చెప్పారట. అందుకు షర్మిల ససేమీరా అన్నారట. అయితే రాజంపేట ఎంపీ స్థానం అవినాష్ కు కేటాయించుకోమని… కడపలో అవినాష్ వద్దని షర్మిల పట్టుబట్టారు.

వైఎస్ వివేకా కేసులో అవినాష్ కు సహాయ నిరాకరణ

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అవినాష్ రెడ్డికి గాని ఆయన తండ్రి భాస్కర రెడ్డికి గాని అతని అనుచరులకు గాని అసలు ఏ మాత్రం సహకరించకూడదు. కేసు విషయంలో తలదూర్చవద్దని షర్మిల గట్టిగా చెప్పారట. ఈ విషయంలో జగన్ వర్గం నుంచి షర్మిలకు క్లారిటీ రాలేదట. అలాగే ఈ కేసు విషయంలో పూర్తిగా సహకరించాలని ఆమె కోరారట. దీనిపై ఇంకా జగన్ వర్గం నుంచి స్పందన మాత్రం రాలేదట.

ఖమ్మం జిల్లా ఆస్తులపై షర్మిల డిమాండ్

ఖమ్మం జిల్లాల్లో బయ్యారం దగ్గరలో ఉన్న ఆస్తులను తాను తీసుకుంటాను అని, అలాగే బెంగళూరులో ఉన్న కొన్ని ఆస్తులు కూడా తన పేరు మీద రాయాలని, లోటస్ పాండ్ మొత్తం తన పేరు మీదనే రాయాలని షర్మిల డిమాండ్ చేసారట. దీనికి జగన్ వర్గం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. కడప జిల్లాలో ఉన్న ఆస్తుల్లో తనకు వాటా కావాల్సిందే అని అడిగారట షర్మిల. దీనిపై ఇంకా స్పందన జగన్ వర్గం తెలియజేయలేదని తెలుస్తోంది.

కాంగ్రెస్ తో పొత్తు కండీషన్ లు

ఒకవేళ జగన్ షర్మిల డిమాండ్ లకు అంగీకరిస్తే… కాంగ్రెస్ తో పొత్తు కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు సీట్ల పంపకం నిష్పత్తి 60:40 గా ఉండాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. పొత్తులో ఉంటే కడప ఎంపీ, ఎమ్మెల్యే, కమలాపురం, రాజంపేట ఎంపీ స్థానం తనకే కావాలని షర్మిల డిమాండ్ చేసారట. అప్పుడు మాత్రమే కాంగ్రెస్ కు దగ్గర చేస్తాను అని లేని పక్షంలో పోరాటం కొనసాగుతుందని షర్మిల క్లియర్ కట్ గా చేప్పెసారట.

జగన్ కంటే షర్మిల మొండి అని అంటూ ఉంటారు. ఇప్పుడు జగన్ వర్గం ముందు ఉంచిన కండీషన్ లు చూస్తే… అది నిజమే అనే అనుమానం కలుగుతోంది. షర్మిల ముందు నుంచి వైఎస్ అవినాష్ కుటుంబానికి వ్యతిరేకంగానే ఉన్నారు. 2014 లో పొంగులేటి కారణంగా 2019 లో అవినాష్ కారణంగా ఆమె ఎంపీ సీటు కోల్పోయారు. ఇప్పటి వరకు షర్మిల కనీసం కార్పొరేటర్ గా కూడా గెలవలేదు. ఈ అసహనంలోనే ఆమె ఎక్కువగా ఉన్నారు.